అన్వేషించండి

NSAT 2022: పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్‌షిప్‌ టెస్ట్, దరఖాస్తు చేసుకోండి!

7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం నారాయణ స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్ (NSAT) నిర్వహణకు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా  పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేస్తారు.

Website


పరీక్ష వివరాలు..

* స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను అక్టోబర్‌ 26 - 30 వరకు, నవంబర్‌ 2 - 6 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు.

* నవంబర్‌ 12 నుంచి 20 వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. 

* ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు (ఆన్‌లైన్ - ఎగ్జామ్ లాగిన్ విండో) పరీక్ష, ఆఫ్ లైన్‌ విధానంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

* పరీక్ష సమయం 1 గంట.

 

Also Read

బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ! 
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా  ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం.  
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..    

Also Read
పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌  
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందుతోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1వ తరగతి నుండి డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌లను అభ్యసించే పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించింది. HDFC ECS స్కాలర్‌షిప్ పథకం కింద, వ్యక్తిగత/కుటుంబ సంక్షోభం లేదా ఏదైనా ఇతర ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు అయ్యే ఖర్చును భరించలేక, ఆగిపోయే ప్రమాదం ఉన్న విద్యార్థులకు వారి చదువుల కోసం రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందుతోంది. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన HDFC బ్యాంక్, తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ - ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ (ECS)లో భాగంగా ఈ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. బ్యాంక్ తన సామాజిక చొరవ - పరివర్తన్‌లో భాగంగా విద్య మరియు జీవనోపాధి శిక్షణ రంగంలో వివిధ ప్రాజెక్టులను చేపడుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
   

Also Read
పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?  
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి గాను అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ ఆధారంగా వారి ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అందిస్తారు. విద్యార్థులు చదువుతున్న కోర్సుల ఆధారంగా ఏడాదికి రూ.2500 నుంచి రూ.13,500 వ‌ర‌కు ఉపకారవేతనం అందిస్తారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.  
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget