అన్వేషించండి

AP EAPCET 2023 Counselling: ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ తుది విడత షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 12న విడుదల చేసింది.

ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ తుది విడత షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 14 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏపీఈఏపీసెట్-2023 తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు  యూనివర్సిటీ & ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీల కాలేజీలలో కన్వీనర్ కోటా కింద ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. 

ఏపీఈఏపీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు. 

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినవారు ధ్రువపత్రాల పరిశీలన కోసం సెప్టెంబరు 14 నుంచి 16 వరకు ఆన్‌లైన్ ద్వారా అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబరు 14 నుంచి 17 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్లు మార్చుకోదలచినవారు సెప్టెంబరు 17న మార్పులు చేసుకోవచ్చు. ఇవన్నీ పూర్తయ్యాక సెప్టెంబరు 21న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 22 నుంచి 25లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ప్ రిపోర్టింగ్ చేసి సీటును ధ్రువీకరించుకోవాలి. అనంతరం సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

తుది విడత షెడ్యూలు ఇలా..

➥ ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 14.09.2023 నుంచి 15.09.2023 వరకు.

➥ ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ కోసం సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌: 14.09.2023 నుంచి 16.09.2023 వరకు.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 14.09.2023 నుంచి 17.09.2023 వరకు.

➥ వెబ్ ఆప్షన్లలో మార్పులు: 17.09.2023.

➥ సీట్ల కేటాయింపు: 21.09.2023.

➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌(ఆన్‌లైన్), సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్‌: 22.09.2023 నుంచి 25.09.2023 వరకు.

ఈ సర్టిపికేట్లు అవసరం..

➥ ఏపీఈఏపీసెట్-2023 ర్యాంక్ కార్డ్

➥ ఏపీఈఏపీసెట్-2023 హాల్ టికెట్

➥ ఆధార్ కార్డ్

➥ S.S.C లేదా అందుకు సమానమైన మార్కుల మెమో

➥ ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్

➥ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C)

➥ 01-01-2020న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ (వర్తిస్తే) లేదా తెల్ల రేషన్ కార్డు ఉండాలి.

➥ తహసీల్దార్ జారీ చేసిన EWS ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2023-24 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది. (వర్తిస్తే)

➥ అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్

➥ అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్

➥ స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

Counselling Notification

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR slams Rahul Gandhi: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
Medicine Price Hike: 900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
Mega 157 Update: అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ameer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP DesamMumbai Indians Ashwani Kumar | బుమ్రా నుంచి అశ్వనీ వరకూ ముంబై టాలెంట్ హంట్ కి హ్యాట్సాఫ్ | ABP DesamMI Bowler Ashwani Kumar Biography | IPL 2025 లో సంచలన అరంగేట్రం చేసిన అశ్వనీ కుమార్ | ABP DesamAshwani Kumar 4 Wickets vs KKR | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో డెబ్యూ చేసిన అశ్వనీ కుమార్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR slams Rahul Gandhi: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
Medicine Price Hike: 900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
Mega 157 Update: అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
HCU Lands Issue: ఆ 400 ఎకరాల భూములపై హైకోర్టులో పిటిషన్, రేపు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
ఆ 400 ఎకరాల భూములపై హైకోర్టులో పిటిషన్, రేపు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
NTR Neel Movie: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్... నీల్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసిందోచ్
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్... నీల్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసిందోచ్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
Embed widget