APOSS RESULT: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్స్ ఇవే
ఏపీలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ అడ్మిషన్ నెంబరు లేదా రోల్ నెంబరు వివరాల ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

APOSS Results: ఏపీలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 25న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ అడ్మిషన్ నెంబరు లేదా రోల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ మార్కుల జాబితాలను సంబంధిత స్టడీ సెంటర్లలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది మార్చి 18 నుంచి 27 వరకు ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయాతేదీల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించారు.
పదోతరగతి పరీక్షలకు 32,581 మంది హాజరుకాగా.. 18,185 మంది అర్హత సాధించారు. మొత్తం 55.81శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు హాజరుకాగా.. 48,377 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 65.77శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఓపెన్ స్కూల్ టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం..
ఏపీలో ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ఎప్పుడో పూర్తయి.. ఫలితాలు వెలువడగా.. తెలంగాణలో మాత్రం ఏప్రిల్ 25న పరీక్షలు ప్రారంభమయ్యాయి. మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 25.04.2024
ఉదయం సెషన్: తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.
➥ 26.04.2024
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.
➥ 27.04.2024
ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.
మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.
➥ 29.04.2024
ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.
మధ్యాహ్నం సెషన్: హిందీ.
➥ 30.04.2024
ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.
➥ 01.05.2024
ఉదయం సెషన్: ఎకనామిక్స్.
మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.
➥ 02.05.2024
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.
మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 25.04.2024
ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ.
మధ్యాహ్నం సెషన్: అరబిక్.
➥ 26.04.2024
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: సోషియాలజీ.
➥ 27.04.2024
ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.
మధ్యాహ్నం సెషన్: కెమిస్ట్రీ, పెయింటింగ్.
➥ 29.04.2024
ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, ఫిజిక్స్.
➥ 30.04.2024
ఉదయం సెషన్: హిస్టరీ.
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జియెగ్రఫీ.
➥ 01.05.2024
ఉదయం సెషన్: ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్.
మధ్యాహ్నం సెషన్: బయాలజీ, అకౌంటెన్సీ, హోంసైన్స్.
➥ 02.05.2024
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).
మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.
ప్రాక్టికల్ పరీక్షలు..
జనరల్ & వొకేషనరల్ సబ్జెక్టులు: 03.05.2024 - 10.05.2024.
ALSO READ:
ఏప్రిల్ 30న పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు, 'రిజల్ట్' వెల్లడి సమయం ఇదే
తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఏప్రిల్ 24న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయిందని, డీకోడింగ్ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుందని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల సందర్భంగా.. ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

