Inter Halltickets: ఏపీ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలక సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.
Inter Halltickets: ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలక సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నంబర్/ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్‌తో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం 4.73 లక్షల మంది, ఇంటర్ రెండో సంవత్సరం 5.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 5న ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 20తో ముగియడంతో.. తాజాగా ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
పకడ్భందీగా ఏర్పాట్లు..
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లో అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల హాజరును ఆన్‌లైన్ ద్వారా తీసుకోనున్నారు. అలాగే పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే వివరాలు తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు.
ఫోన్లకు నో పర్మిషన్..
పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసింది. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్‌లలో కూడా ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. అక్కడ ప్రత్యేకమైన బేసిక్ ఫోన్‌ను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫోన్‌లు కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్‌లను చూసేందుకే మాత్రమే ఉపయోగపడుతుంది. తిరిగి మెసేజ్ ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు ఈ ఫోన్లలో సదుపాయం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంచిత చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాక్టికల్ మార్కులకు ఆన్‌లైన్..
ఈసారి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్ బోర్డు పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌లోకి మార్చింది. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇంటర్ బోర్డు ఈ ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా ఏవిధమైన పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది.
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..
➥ మార్చి 1- శుక్రవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
➥ మార్చి 4 - సోమవారం - ఇంగ్లిష్ పేపర్-1
➥ మార్చి 6 - బుధవారం - మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.
➥ మార్చి 9 - శనివారం - మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
➥ మార్చి 12 - మంగళవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1
➥ మార్చి 14 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1
➥ మార్చి 16 - శనివారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
➥ మార్చి 19 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..
➥ మార్చి 2 - శనివారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
➥ మార్చి 5 - మంగళవారం - ఇంగ్లిష్ పేపర్-2
➥ మార్చి 7 - గురువారం - మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2.
➥ మార్చి 11 - సోమవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
➥ మార్చి 13 - బుధవారం - ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
➥ మార్చి 15 - శుక్రవారం - కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2
➥ మార్చి 18 - సోమవారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
➥ మార్చి 20 - బుధవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2