అన్వేషించండి

AP TET Application: ఏపీటెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APTET 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆగస్టు 3 వరకు దరఖాస్తు గడువును పెంచింది. అభ్యర్థులకు సూచనలు చేసింది.

APTET Application Last Date: ఏపీ టెట్ జులై-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. టెట్ దరఖాస్తుకు ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు టెట్ పరీక్ష కోసం 3.20 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 3 నుంచి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లను సెప్టెంబరు 22 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు: 9505619127, 9705655349, 8121947387, 8125046997 ద్వారా సంప్రదించవచ్చు. 

అర్హతలు..

🔰 పేపర్-1 ఎ (1 - 5వ తరగతులకు)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు  బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి. 
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰 పేపర్-1 బి (1 - 5వ తరగతులు) స్పెషల్ స్కూల్స్ 
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ పీజీ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ జూనియర్ డిప్లొమా (టీచింగ్-డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ప్రైమరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)
➥ డిప్లొమా (ఒకేషనల్ రిహాబిలిటేషన్-మెంటల్ రిహాబిలిటేషన్)/ డిప్లొమా (ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్-మెంటల్ రిటార్డేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్‌తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో RCI గుర్తింపు పొందిన ఏడాది కోర్సు కలిగి ఉండాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి.

🔰  పేపర్-2 ఎ (6 - 8వ తరగతులు)
మ్యాథమెటిక్స్-ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్/ సోషల్ స్టడీస్/ లాంగ్వేజ్ టీచర్లు 
➥ 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీతోపాటు బీఈడీ ఉండాలి. (లేదా)
➥ 45 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి.  (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ లేదా బీఏఈడీ/బీఎస్‌ఈఈడీ. (లేదా)
➥ 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰  లాంగ్వేజ్ టీచర్స్..
లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉండాలి. (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఒరియంటెల్ లాంగ్వేజ్ (లేదా) గ్రాడ్యేయే పీషన్ (లిటరేచర్) (లేదా)  సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీతోపాటు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్/బీఈడీ(సంబంధిత లాంగ్వేజ్‌) కలిగి ఉండాలి. 
🔰 పేపర్-2 బి (6 - 8వ తరగతులు) స్పెషల్ స్కూల్స్
➥ కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల పీజీ డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్/ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్/మల్లిపుల్ డిజెబిలిటి-ఫిజికల్, న్యూరోలాజికల్/లోకోమోటర్ ఇంపేర్‌మెంట్ & సెరిబ్రల్ పాల్సీ) అర్హత ఉండాలి. 
➥ సెకండరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)/ సీనియర్ డిప్లొమా టీచింగ్(డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఏ.బీఈడీ (విజువల్ ఇంపేర్‌మెంట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

పరీక్ష ఫీజు: ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షల(ఏపీటెట్)ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

➥ ఏపీటెట్ జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 -03.08.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.07.2024 -03.08.2024.

➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 19.09.2024 నుంచి.

➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 22.09.2024 నుంచి 

➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 03.10.2024 - 20.10.2024.  {పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}

➥ పరీక్ష సమయం..
సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
సెషన్-2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు

➥ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల: 04.10.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 05.10.2024 నుంచి.

➥ టెట్ ఫైనల్ కీ: 27.10.2024.

➥ టెట్ ఫలితాల వెల్లడి: 02.11.2024.

AP TET JULY 2024 Fee Payment

AP TET 2024 Online Application

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget