అన్వేషించండి

AP SSC Exam Fee: ఏపీ 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్‌, పరీక్ష ఫీజు షెడ్యూలు విడుదల - ఎప్పటిదాకా ఫీజు చెల్లించవచ్చంటే?

ఏపీలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు విడుదలైంది. అక్టోబరు 28 నుంచి నవంబర్ 10 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

AP: ఏపీలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు విడుదలైంది. అక్టోబరు 28 నుంచి నవంబర్ 10 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 11 నుంచి 16 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 17 నుంచి 22 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో నవంబరు 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఫీజు చెల్లింపు తేదీలు..

➥ రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 11 నుంచి 16 వరకు 

➥ రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 17 నుంచి 22 వరకు 

➥  రూ.500 ఆలస్యరుసుముతో నవంబరు 23 నుంచి 30 వరకు. 

ఫీజు చెల్లింపు వివరాలు..

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే వారు రూ.110 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ ప్రైవేటు విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం అదనంగా రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.

➥ మూగు, చెవుడు, అంధ విద్యార్థులకు పరీక్ష ఫీజు, హాజరు మినహాయింపు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 40 శాతం పైగా ప్రభావం ఉన్నవాళ్లను దివ్యాంగుల కేటగిరీ పరిగణిస్తారు.

➥ మూగ, చెవుడు విద్యార్థులకు రెండు భాషా సబ్జెక్టుల నుంచి మినహాయింపు ఉంది. అంధ అభ్యర్థులు స్క్రైబ్ తీసుకోవడానికి అర్హులు.

➥ లాంగ్వే్జ్ సబ్జెక్టుల నుంచి మినహాయింపు కోరే దివ్యాంగ విద్యార్థులు ముందుగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు..
ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. 

ఏడు పేపర్లతోనే పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 

ప్రశ్నపత్రాల్లో మార్పులు..

తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు. 

➥ తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

➥ రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు ఉంటాయి.

➥ హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చేశారు. గతంలో బిట్ పేపర్‌ను తొలగించగా.. ఇప్పుడు అదేవిధానాన్ని తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలే అధికం.

మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget