APSET 2024: ఏపీ సెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 'ఏపీసెట్-2024' దరఖాస్తు గడువును మార్చి 14 వరకు పొడిగించినట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు మార్చి 6న ఒక ప్రకటనలో తెలిపారు.
![APSET 2024: ఏపీ సెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే? ap set 2024 online application last date extended check last date here APSET 2024: ఏపీ సెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/09815db655b3907c4520da186b3f8d4b1707592662443522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP SET 2024 Application: ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష 'ఏపీసెట్-2024 (AP SET 2024)' దరఖాస్తు గడువును మార్చి 14 వరకు పొడిగించినట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు మార్చి 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థలను పరిశీలించి దరఖాస్తు గడువును మార్చి 14 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఎటుంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన వెల్లడించారు. ఇక రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 25 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఏపీసెట్ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 28న రాష్ట్రవ్యాప్తంగా 8 రీజినల్ కేంద్రాల పరిధిలో నిర్వహస్తామని ఆయన తెలిపారు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహణ బాధ్యత చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 19 నుంచి అందబాటులో ఉంచనున్నారు.
వివరాలు..
* ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (ఏపీసెట్)-2024
సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్- ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు 19.09.1991లోపు మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉంటే దరఖాస్తుకు అర్హులు.
➥ 01.06.2002 కు ముందు సెట్/నెట్ పూర్తిచేసినవారికి ఏపీనెట్2025 నుంచి మినహాయింపు ఉంది.
వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: ఏపీ సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1(జనరల్ పేపర్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2(అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పేపర్-1కు 60 నిమిషాలు (గంట), పేపర్-2కు 120 నిమిషాల (2 గంటల) సమయం కేటాయించారు.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఏపీసెట్ - 2024 నోటిఫికేషన్: 10.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 06.03.2024.
➥ రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 16.03.2024.
➥ రూ.5000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది (పరీక్ష కేవలం విశాఖపట్నంలో): 30.03.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 19.04.2024
➥ ఏపీ సెట్ - 224 పరీక్ష తేది: 28.04.2024.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)