News
News
వీడియోలు ఆటలు
X

AP Polycet 2023 Results: నేడు ఏపీ పాలిసెట్‌ ఫలితాల విడుదల, ఈ లింక్ ద్వారా రిజల్ట్ చూసుకోవచ్చు!

ఏపీ పాలిసెట్-2023 ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10.45 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

ఏపీ పాలిసెట్-2023 ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10.45 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూలు సైతం నేడు ప్రకటించనున్నారు. ఏపీలో మే 10న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,43,625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫలితాల కోసం వెబ్‌సైట్: https://polycetap.nic.in

ప్రవేశాలు కల్పించే సంస్థలు..
పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

డిప్లొమా కోర్సులు..
సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Also Read:

సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష తేదీలివే!
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023' పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు; అదేవిధంగా.. జూన్‌ 5, 6 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతానికి మే 21, 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్‌ కార్డులను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసింది. మిగతా తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.
CUET UG - 2023 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

నిఫ్టెమ్‌లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హరియాణా(సోనిపట్‌)లోని ''నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)'' సంస్థ 2023-2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించాను. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, పరీక్షల తేదీలివే!
తెలంగాణలో మే 9న ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ు నిర్వహించ‌నున్నట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం (మే 17) తెలిపింది. ఈ మేర‌కు ప‌రీక్షల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్రథ‌మ సంవ‌త్సరం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్సరం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 20 May 2023 09:36 AM (IST) Tags: AP POLYCET Results Education News in Telugu AP POLYCET 2023 Results AP POLYCET 2023 Exam Results POLYCET 2023 Results

సంబంధిత కథనాలు

ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!

ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!

ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2023 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!

ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2023 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు