News
News
వీడియోలు ఆటలు
X

NIFTEM: నిఫ్టెమ్‌లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా!

''నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)'' సంస్థ 2023-2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హరియాణా(సోనిపట్‌)లోని ''నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)'' సంస్థ 2023-2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించాను. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

వివరాలు...

1) బీటెక్‌ ప్రోగ్రాం (ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌)

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.

అర్హత: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్స్‌)-2023 అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: సీఎస్‌ఏబీ నిర్వహించే సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

2) ఎంటెక్‌ ప్రోగ్రాం

విభాగాలు: ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌.

కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

3) ఎంబీఏ ప్రోగ్రాం

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

విభాగాలు: ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌/ ఫైనాన్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

4) పీహెచ్‌డీ ప్రోగ్రాం

విభాగాలు: అగ్రికల్చర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, బేసిక్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.05.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 15.06.2023.

Notification

Online Application

Website

Also Read:

బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలివే!
కోల్‌కతాలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజెబిలిటీస్' 2023 విద్యా సంవత్సరానికిగాను బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 'కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఏఎల్‌డీ(కోల్‌కతా), ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌(కటక్), ఎన్‌ఐఈపీఎండీ(చెన్నై), పీడీయూఎన్‌ఐపీపీడీ(న్యూఢిల్లీ)లో ప్రవేశాలు కల్పించనున్నారు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్!
తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 9లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 19 May 2023 03:55 PM (IST) Tags: NIFTEM Admissions NIFTEM courses Education News in Telugu NIFTEM Notification NIFTEM Admission Notification

సంబంధిత కథనాలు

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్