NILD CET 2023: బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలివే!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ 2023 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 'కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కోల్‌కతాలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజెబిలిటీస్' 2023 విద్యా సంవత్సరానికిగాను బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 'కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఏఎల్‌డీ(కోల్‌కతా), ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్(కటక్), ఎన్‌ఐఈపీఎండీ(చెన్నై), పీడీయూఎన్‌ఐపీపీడీ(న్యూఢిల్లీ)లో ప్రవేశాలు కల్పించనున్నారు.
వివరాలు..
➥ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్‌జన్), కోల్‌కతా (ఎన్‌ఏఎల్‌డీ)
➥ స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్), కటక్
➥ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై
➥ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (పీడీయూఎన్‌ఐపీపీడీ), న్యూఢిల్లీ.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు..
➜ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)
➜ బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ)
➜ బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీవో)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు. 6 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.
వయోపరిమితి: కనీసం 17 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.800. మిగతా కేటగిరీలకు రూ.1000.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.04.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.06.2023.
* అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 16.06.2023 నుంచి 30.06.2023 వరకు.
* ప్రవేశ పరీక్ష తేదీ: 09.07.2023
* ఫలితాల ప్రకటన: 17.07.2023.
Also Read:
గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్!
తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 9లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..