AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ పీజీసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇవాళ విడుదల చేశారు. పీజీ సెట్ లో మొత్తం 24,164 మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు.
ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ మంగళవారం ఫలితాలు విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ రామ్మోహనరావు, యోగి వేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉమ్మడి పీజీ సెట్ నిర్వహించింది.
Also Read: హోరాహోరీగా ఏపీలో మినీ స్థానిక సమరం ! తాజా పరిస్థితి ఇదే..
ఆన్ లైన్ లో ప్రవేశ పరీక్ష నిర్వహణ
ఫలితాల విడుదల అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్శిటీలలో పీజీ ప్రవేశాలకి కామన్ సెట్ మొదటిసారిగా నిర్వహించామన్నారు. ఆన్‌లైన్లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను కేవలం రెండు వారాల సమయంలోనే ప్రకటించినట్లు తెలిపారు. వివిధ యూనివర్శిటీల్లో పీజీ ప్రవేశాలకు మొత్తం 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకు 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. ఫలితాల కోసం https://sche.ap.gov.in/APPGCET/UI/HomePages/Results వెబ్ సైట్ పొందవచ్చని పేర్కొన్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !
తొలిసారిగా ఉమ్మడి పీజీసెట్
ఇప్పటి వరకూ యూనివర్శిటీల ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష లేదని, అందువల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇప్పుడు ఉమ్మడి పీజీ సెట్ వల్ల విద్యార్థులకు శ్రమ తగ్గిందన్నారు. పీజీ సెట్ లో అర్హత సాధించిన విద్యార్ధులు రాష్ట్రంలో తమకు నచ్చిన యూనివర్శిటీలో ఇష్టమొచ్చిన కోర్సులో చేరవచ్చని తెలిపారు. సీఎం జగన్ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రవేశ పరీక్షలలో ఎలాంటి అవకతవకలకి చోటులేకుండా కట్టుదిట్టంగా నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.
Also Read: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు... ఈ నెల 18 నుంచి సభాపర్వం
మంత్రికి చేదు అనుభవం
మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం ఘటనపై విజయవాడ అర్ అండ్ బీ భవనంలో మంత్రి సురేశ్ మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చారు. ఈ సమయంలో విద్యార్థి సంఘాలు మంత్రిని అడ్డుకున్నాయి. అనంతపురం లాఠీఛార్జ్ ఘటనపై విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజు వసూలు చేస్తే పేదలు ఎలా భరిస్తారని నిలదీశారు. నిన్న అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎయిడెడ్ సంస్థలపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంత్రితో మాట్లాడుతుండగానే విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ .. సమస్యల పరిష్కారానికి ఏపీ, ఒడిషా సీఎంల నిర్ణయం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి