AP PECET - 2024: ఏపీ పీఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, షెడ్యూలులోను మార్పులు
ఏపీలోని బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2024 దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించారు. ఆలస్య రుసుముతో జూన్ 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
AP PECET - 2024: ఏపీలోని బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 28న ప్రారంభమైంది. అయితే దరఖాస్తు గడువు మే 15తో ముగియాల్సి ఉండగా.. మే 31 వరకు పొడిగించారు. ఇక రూ.500 జూన్ 7 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సవరణకు జూన్ 15, 16 తేదీల్లో అవకాశం కల్పించారు. జూన్ 20 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 25 నుంచి ఫిజికల్ టెస్టులు, గేమ్ స్కిల్ టెస్టులు నిర్వహించనున్నారు. టెస్టులు పూర్తయిన వారంరోజులకు ఫలితాలను వెల్లడించనున్నారు. గుంటూరులోని ఆచార్యనాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈవెంట్లు నిర్వహించనున్నారు.
వివరాలు...
* ఏపీ పీఈసెట్ – 2024 (AP PECET 2024)
అర్హత: బీపీఈడీ కోర్సుకు డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూజీడీపీఈడీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి బీపీఈడీ కోర్సుకు 19 సంవత్సరాలు, డీపీఈడీ కోర్సుకు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇదివరకే పీఈటీలుగా పనిచేస్తున్న అభ్యర్థులు ఏపీపీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వీరు సంబంధిత డీఈఓల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్- రూ.900, బీసీ-రూ.800, ఎస్సీ-ఎస్టీలకు రూ.700.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 25.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.05.2024.
➥ రూ.500 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 07.06.2024.
➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 14.06.2024.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 15.06.2024 & 16.06.2024.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 20.06.2024 నుంచి.
➥ ఏపీ పీఈసెట్ పరీక్షతేది (ఫిజికల్ ఈవెంట్స్): 25.06.2024 నుంచి.
రిపోర్టింగ్ సమయం: ఉదయం 6 గంటలు.
ఈవెంట్స్ ప్రారంభం: ఉదయం 7 గంటల నుంచి.
వేదిక: A.N.U. Campus, Guntur.
ALSO READ:
సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్షల షెడ్యూలు ఇదే
తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) -2024’ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి మే 15న విడుదల చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, వైస్‌ఛైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ రవీందర్, సెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి సహా పలు వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు. సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 18 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్యరుసుముతో జూన్ 25 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 5న సీపీగెట్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
సీపీగెట్-2024 పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..