News
News
X

NMMS Exam Hall Tickets: వెబ్‌సైట్‌లో ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే!

పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (జాతీయ ఉపకార వేతన పరీక్ష - ఎన్‌‌ఎంఎంఎస్) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 5న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు  దేవానందరెడ్డి  స్పష్టంచేశారు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

రాత పరీక్ష:

➥ ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.



➥ మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌): ఈ పేపర్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, క్రిటికల్‌ థింకింగ్‌ నుంచి 90ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.

➥ స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌): ఈ పేపర్‌లోనూ 90ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయి లో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. 

కనీస మార్కులు:
రెండు పరీక్ష(మ్యాట్, శాట్‌)ల్లో సగటున జనరల్‌ అభ్యర్థులకు 40శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్‌ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది.ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తోంది.


రూ.12వేల స్కాలర్‌షిప్‌

➥ ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ /10+2 తత్సమాన తరగతి పూర్తిచేసే వరకు ఈ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

➥ తొమ్మిదో తరగతి నుంచి పదోతరగతికి స్కాలర్‌షిప్‌ కొనసాగాలంటే.. అభ్యర్థి 55శాతం మార్కులతో ప్రమోట్‌ కావాలి. అలాగే పదోతరగతిలో 60శాతం మార్కులు సాధిస్తే.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 55శాతం మార్కులతో ప్రమోట్‌ అయితే రెండో సంవత్సరంలో స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌ రెన్యూవల్‌ చేసుకోవాలి.

Also Read:

ఇక కంప్యూటర్‌ సైన్స్‌లో ‘బీఎస్సీ ఆనర్స్‌' డిగ్రీ, ఈ ఏడాది నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సును అందుబాటులోకి తేనున్నారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచే కళాశాలల్లో హానర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. జనవరి 20న హైదరాబాద్‌లోని విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష తేదీలివే!
జేఈఈ మెయిన్ 2023 పరీక్షల మొదటి విడత అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 21న విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29,30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా జనవరి 28న మాత్రం కేవలం పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.   
జేఈఈ మెయిన్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 21 Jan 2023 11:42 PM (IST) Tags: Education News in Telugu AP NMMS Exam AP NMMS AP NMMS Exam Date AP NMMS Exam Hall Tickets Andhra Pradesh NMMS 2022

సంబంధిత కథనాలు

TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత‌ హోదా ఉద్యోగం!

Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత‌ హోదా ఉద్యోగం!

KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

TS Teachers Transfers: నేడు ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా వెల్లడి!

TS Teachers Transfers: నేడు ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా వెల్లడి!

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని