AP Lawcet Counselling: ఏపీ లాసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలో లాసెట్ రెండో, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలును డిసెంబరు 19న అధికారులు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 21 నుంచి జనవరి 5 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
AP LAWCET Final Phase Counselling: ఏపీలో లాసెట్ రెండో, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలును డిసెంబరు 19న అధికారులు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 21 నుంచి జనవరి 5 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. లాసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేని అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఉమమహేశ్వరి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 21 నుంచి 23 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసని అభ్యర్థులకు డిసెంబరు 22 నుంచి 26 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం డిసెంబరు 27 నుంచి 29 వరకు కళాశాలల ఎంపికకు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. డిసెంబరు 30న వెబ్‌ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పించారు. ఇక చివరగా జనవరి 2న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జనవరి 3 నుంచి 5 లోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ వెబ్‌కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్: 21.12.2023 - 23.12.2023.
➥ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 22.12.2023 - 26.12.2023.
➥ వెబ్ఆప్షన్ల నమోదు: 27.12.2023 - 29.12.2023.
➥ వెబ్‌ఆప్షన్ల సవరణ: 30.12.2023.
➥ సీట్ల కేటాయింపు: 02.01.2024.
➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 03.01.2024 - 05.01.2024.
ఏపీలో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 16న ఫలితాలను విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203మంది హాజరు కాగా.. వారిలో 13,402 మంది క్వాలిఫై అయ్యారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.
కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు..
* ఏపీలాసెట్-2023 ర్యాంకు కార్డు
* ఏపీలాసెట్-2023 హాల్‌టికెట్
* డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు.
* ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్
* పదోతరగతి మార్కుల మెమో
* గడచిన ఏడేళ్ల నుంచి అన్ని స్టడీ సర్టిఫికేట్లు
* రెసిడెన్స్ సర్టిఫికేట్
* ఇన్‌కమ్ సర్టిఫికేట్/ తెల్లరేషన్ కార్డు
* ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఐడీ కార్డు (పాన్/డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి)
* క్యాస్ట్ సర్టిఫికేట్
* PH/Sports/CAP/NCC / స్కౌట్స్ & గైడ్స్ సర్టిఫికేట్.
* మైనారిటీ సర్టిఫికేట్
* ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
తెలంగాణలో డీఈఈ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. డీఈఈసెట్ ఫలితాలు వచ్చిన ఆరు నెలల తర్వాత అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూలును విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 20 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 5 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాస్ చారి డిసెంబరు 19న ఒక ప్రకటనలో తెలిపారు. 2023-25 విద్యాసంవత్సరానికి గానూ డీపీఎస్ఈ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..