AP KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం
AP KGBV Admission 2024: అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
AP KGBV Admissions Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2024-25 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన బాలికలకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 352 కేబీవీ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీట్ల భర్తీకి మార్చి 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రారంభంకావాల్సి ఉంది. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థుల సెలక్షన్ జాబితా ఏప్రిల్ 15 నాటికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు వెరిఫికేషన్ చేసి.. ఏప్రిల్ 19న జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌లో సమాచారం ఇస్తారు. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు సంబంధిత కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు.
అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు SMS ద్వారా సమాచారం అందిస్తారు.
ప్రవేశాలు కోరువారు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా ప్రదర్శిస్తారు. అడ్మిషన్ల విషయంలో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే కేజీబీవీ టోల్ ఫ్రీ నంబర్ 18004258599 ద్వారా సంప్రదించవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (6, 11వ తరగతి): 12.03.2024.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.04.2024.
* ప్రాథమిక ఎంపికజాబితా వెల్లడి: 15.04.2024.
* స్టేట్ ఆఫీస్ ద్వారా ఎంపికజాబితా ధ్రువీకరణ: 16 - 18.04.2024.
* తుది ఎంపికజాబితా వెల్లడి: 19.04.2024.
* ఎంపికైనవారికి ధ్రువపత్రాల పరిశీలన: 19 - 24.04.2024.
Also Read:
ఏపీ ఎప్‌సెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, అప్లికేషన్ చివరితేది ఎప్పుడంటే?
AP EAPCET 2024 Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి రూ.500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో మే 5 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మే 10 వరకు, రూ.10,000 ఆలస్యరుసుముతో మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఎప్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
AP EAPCET 2024 Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సు్ల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడింది. దీనిద్వారా 2024 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 13 నుండి 19 వరకు ఏపీ ఈఏపీసెట్ (EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ ఎప్‌సెట్ నోటిఫికేషన్, అప్లికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..