అన్వేషించండి

AP EAPCET 2024 Application: ఏపీ ఎప్‌సెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, అప్లికేషన్ చివరితేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఎప్‌‌సెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

AP EAPCET 2024 Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి రూ.500 ఆలస్యరుసుముతో  ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో  మే 5 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో  మే 10 వరకు, రూ.10,000 ఆలస్యరుసుముతో  మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 13 నుండి 19 వరకు ఏపీ ఈఏపీసెట్ (EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. మే 13 నుంచి 16 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, మే 17 నుంచి 19 వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ కె.వెంటక రెడ్డి ఏపీఈఏపీసెట్ 2024 కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఎప్‌సెట్ ద్వారా 2024 విద్యాసంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు..

* ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ &‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) - 2024 

ప్రవేశాలు కల్పించే కోర్సులు:

➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ

➥ బీఫార్మసీ, ఫార్మా-డి.

➥ బీఎస్సీ (నర్సింగ్).

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి..

➥ ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

➥ అగ్రికల్చర్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు (25 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది. 

➥  బీఎస్సీ నర్సింగ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు, దివ్యాంగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

రిజిస్ట్రేషన్ ఫీజు..

➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

➥ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

➥  నోటిఫికేషన్ వెల్లడి: 11.03.2024.nn 

➥  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.05.2024 to 06.05.2024

➥  రూ.500 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.

➥  రూ.1000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.05.2024.

➥  రూ.5000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.05.2024.

➥  రూ.10000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2024.

➥  హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 07.05.2024.

➥ ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు..

ఇంజినీరింగ్ విభాగాలకు: 13.05.2024 - 16.05.2024.

అగ్రికల్చర్ & ఫార్మా కోర్సులకు: 17.05.2024 - 19.05.2024

Notification

Online Application

Fee Payment for AP EAPCET - 2024

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget