Inter Affiliation: జూనియర్ కాలేజీల రెన్యువల్‌కు తుది గడువు ఆగస్టు 31, ఆలస్యరుసుముతో ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్స రానికి సంబంధించి ప్రొవిజినల్ అఫిలియేషన్ గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్స రానికి సంబంధించి ప్రొవిజినల్ అఫిలియేషన్ గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. దీంతోపాటు అదనపు సెక్షన్ల మంజూరు కోసం ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించింది. ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు ఎలాంటి జరిమానా లేకుండా ఆగస్టు 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
ఇక ఆలస్యరుసుముతోనూ అవకాశం కల్పించింది. రూ.10 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబరు 10 వరకు, రూ.15 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబరు 20 వరకు, రూ.20 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ సౌరభ్ గౌర్ శుక్రవారం (జులై 28) ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి రెన్యువల్, అఫిలియేషన్ ఫీజు చెల్లించని కాలేజీల యాజమాన్యాలు సంవత్సరానికి రూ.40 వేలు చొప్పున పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రవేశాలకు ఆగస్టు 17 వరకు అవకాశం..
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాల గడువును అధికారులు పొడిగించిన సంగతి తెలిసిందే. 2023-24 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఆగస్టు 17తో ముగియనుంది. ప్రవేశాలు పొందడానికి ఇదే చివరి విడత అని.. మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ స్పష్టం చేశారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్ 14తో మొదటి విడత ప్రవేశాలు, జులై 15 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం చివరి విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మొత్తం 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ఇలా..
➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023.
➥ జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు
➥ ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు
➥ సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు
➥ అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు
➥ అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు
➥ నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు
➥ డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు
➥ 2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు
➥ 2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్
➥ 2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు
➥ 2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే
➥ 2024 మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.