AP Inter Admissions: ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే చివరి అవకాశం!
2023-24 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఆగస్టు 17తో ముగియనుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. 2023-24 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఆగస్టు 17తో ముగియనుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఇదే చివరి విడత అని.. మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్ 14తో మొదటి విడత ప్రవేశాలు, జులై 15 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం చివరి విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మొత్తం 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ఇలా..
➥ జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు
➥ ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు
➥ సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు
➥ అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు
➥ అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు
➥ నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు
➥ డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు
➥ 2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు
➥ 2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్
➥ 2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు
➥ 2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే
➥ 2024 మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో జులై 25 వరకు..
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జులై 25 వరకు అవకాశం కల్పించారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలి. ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2023-24) క్యాలెండర్ ఇలా ..
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్ని ఇంటర్మీడియట్ బోర్డు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023.
➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.
➥ దసరా సెలవులు: 19.10.2023 - 25.10.2023.
➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.
➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 20.11.2023 - 25.11.2023.
➥ సంక్రాంతి సెలవులు: 13.01.2024 - 16.01.2024.
➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.
➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 - 29.01.2024.
➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.
➥ ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.
➥ వేసవి సెలవులు: 01.04.2024 - 31.05.2024.
➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2024 మే చివరి వారంలో
➥ 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial