అన్వేషించండి

AP Inter Supplementary Results:మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు, డైరెక్ట్ లింక్ ఇదే

APBIE: ఏపీలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 18 ఉదయం 11 గంటలకు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

AP Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్‌లో  ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ మధ్యాహ్నం (జూన్ 18) విడుదలకానున్నాయి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు 2.00 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మొదట ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా.. మధ్యాహ్నానికి వాయిదావేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

Step 1:  ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించాలి.

Step 2: అక్కడ హోంపేజీలో 'ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

Step 3: అక్కడ అడిగిన వివరాలు నమోదు చేయాలి

Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి

Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

https://resultsbie.ap.gov.in/

https://www.manabadi.co.in/

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78zశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది ఉన్నారు. ఇంటర్మిడియెట్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. జూన్ 18న ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేసింది.

ALSO READ:

ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు, టెన్త్ పాసైతే చాలు
ఏపీలోని ఫిషరీస్ యూనివర్సిటీలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 10న ప్రారంభంకాగా.. జూన్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్యరుసుముతో జూన్ 29 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget