అన్వేషించండి

Digi Locker: డిజిలాకర్‌లోనూ ఇంటర్ ఫలితాలు ఎందుకు పెట్టినట్టు?

AP Inter Result: విద్యార్థులు తమ ఆధార్ కార్డు నెంబరు ద్వారా డిజిలాకర్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. ఫిజికల్ కాపీలు కూడా పొందవచ్చు. ఇంటర్ ఒరిజినల్ మార్కుల మెమోతో సమానంగా దీన్ని పరిగణిస్తారు.   

Inter Results in Digilocker: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వివిధ వెబ్‌సైట్‌లలో ఫలితాలను అందుబాటులో ఉంచారు.  అయితే డిజిలాకర్‌లోనూ ఫలితాలను ఈ సారి అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు నెంబరు వివరాలు నమోదుచేసి డిజిలాకర్ యాప్‌ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. ఫిజికల్ కాపీలు పొందవచ్చు. డిజిలాకర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల జాబితాకు (మార్కుల మెమో) ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్ ఒరిజినల్ మార్కుల మెమోతో సమానంగా దీన్ని పరిగణిస్తారు.   

డిజిలాకర్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకోవడం ఇలా..

ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజువివరాలను అధికారులు వెల్లడించారు. 

ఫలితాల వివరాలు..

➥ ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 10,02,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,99,756 మంది హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 4,61,273 మంది; ఒకేషనల్ విద్యార్థులు 38,483 మంది ఉన్నారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 5,02,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 3,93,757  మంది; ఒకేషనల్ విద్యార్థులు 32,339 మంది; ప్రైవేటు విద్యార్థులు 76,298 మంది ఉన్నారు. 

➥ ఇంటర్ ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

➥ ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఫలితాల్లో బాలికలదే హవా...
ఇంటర్ ఫలితాల్లో భాలికల హవా కొనసాగింది. జనరల్ విభాగంలో మొదటి సంవత్సరం 71 శాతం బాలికలు అర్హత సాధించగా.. బాలురు 64 శాతం మాత్రమే అర్హత సాధించారు. ఇక ఒకేషనల్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 47 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్‌లో సంవత్సరంలో 59 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 80 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

జనరల్ విద్యార్థులకు సంబంధించి..

➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగానికి చెందిన బాలురు 2,26,240 పరీక్షలకు హాజరుకాగా.. 1,43,688 (64%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 2,35,033 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,67,187 మంది ఉత్తీర్ణత సాధించారు.

➥ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగానికి చెందిన బాలురు 1,88,849 పరీక్షలకు హాజరుకాగా.. 1,41,465 (75%) మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 2,04,908 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,65,063 మంది (81%) ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి..

➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఒకేషనల్ విభాగానికి చెందిన బాలురు 16,502 మంది పరీక్షలకు హాజరుకాగా.. 7,814 (47%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 21,981 మంది పరీక్షలకు హాజరుకాగా.. 15,367 మంది ఉత్తీర్ణత సాధించారు.

➥  ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఒకేషనల్ విభాగానికి చెందిన బాలురు 13,764 మంది పరీక్షలకు హాజరుకాగా.. 8,160 (59%) మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 18,575 మంది పరీక్షలకు హాజరుకాగా.. 14,840 మంది (80%) ఉత్తీర్ణత సాధించారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget