అన్వేషించండి

AP Inter Results: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, వారంరోజుల్లో ఫలితాల వెల్లడి!

Andhr Pradeshలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

AP Inter Results 2024: ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్‌ 7తో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియకు వారంరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఫలితాలు వెల్లడించనున్నారు. ఏప్రిల్ 12, లేదా 13 తేదీల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియగానే అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4న మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు  పాల్గొన్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మార్కులు అప్‌లోడ్ చేయనున్నారు. ఇవన్నీ అయిపోగానే ఫలితాలను వెల్లడించనున్నారు.

గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌తోపాటు సెకండియర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. అంటే 22 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు. ఈసారి కూడా అంతే సమయంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 లేదా ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి

Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి

Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి

Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి

Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి

Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in 

ALSO READ:

AP SSC Results: పదోతరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో ఇటీవల పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు ముగియగానే అధికారులు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 8తో ముగియనుంది. విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు పూర్తిచేయనున్నారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇదంతా పూర్తవడానికి కనీసం రెండువారాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్‌ నాలుగో వారంనాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరనిపక్షలో మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget