By: ABP Desam | Updated at : 17 Sep 2021 09:30 AM (IST)
Edited By: sharmiladevir
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్ర స్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జి.శశిభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు ఉంటుంది.
ఏపీ ఐసెట్ పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తారు. 'కీ' మీద అభ్యంతరాలు ఉండే స్వీకరిస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు 'కీ'పై అభ్యంతరాలను పంపవచ్చని ఆంధ్రా యూనివర్సిటీ పేర్కొంది. ఏపీ ఐసెట్ ఫలితాలు ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది. అడ్మిట్ కార్డు లేకపోతే అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేసింది. నిమిషం నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.
పరీక్ష విధానం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి తరఫున విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఐసెట్ పరీక్ష వ్యవధి 150 నిమిషాలుగా ఉంది. మొత్తం 3 సెక్షన్లలో ప్రశ్నలు ఉంటాయి. ఎనలటికల్ ఎబులిటీ, కమ్యూనికేషన్ ఎబులిటీ, మాథమెటికల్ ఎబులిటీ అనే మూడు సెక్షన్లలో మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
ఏపీ ఐసెట్ 2021 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Also Read: AP PGCET 2021: ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?
Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?
Paramedical Course after 10th: టెన్త్ తరవాత ఈ కోర్స్ చేస్తే, విదేశాల్లో కొలువు సంపాదించొచ్చు
ITI Course after 10th: టెన్త్ తరవాత ఐటీఐ కోర్స్ చేస్తే, ఈ కేంద్ర సంస్థల్లో జాబ్స్ కొట్టేయొచ్చు
Diploma Course after 10th: టెన్త్ తరవాత డిప్లొమా కోర్స్ చేయొచ్చా, అవకాశాలు ఎలా ఉంటాయ్?
TS SSC Supplementary Exams Date: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు డేట్ ఫిక్స్, ఈ తేదీ నుంచే - మంత్రి వెల్లడి
TS SSC Results District Wise: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఈ జిల్లా టాప్! అట్టడుగున హైదరాబాద్ - ఉత్తీర్ణత శాతం ఎంతంటే
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!