AP ICET: ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల, కళాశాలలవారీగా సీట్ల వివరాలు ఇలా
ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ (MBA, MCA) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఉన్నత విద్యా మండలి (APSCHE) నవంబరు 23న విడుదల చేసింది.
AP ICET 2nd Phase SeatAllotment Result 2023: ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ (MBA, MCA) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఉన్నత విద్యామండలి (APSCHE) నవంబరు 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు వివరాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సీట్ల కేటాయింపు ఫలితాలను చూసుకోవచ్చు. అదేవిధంగా కళాశాలలవారీగా సీట్ల కేటాయింపు వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 25లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు ఫలితాలు ఇలా చూసుకోండి..
✦ సీట్ల కేటాయింపు ఫలితాలు చూసుకోవడం కోసం అభ్యర్థులు మొదల AP ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://icet-sche.aptonline.in/
✦ అక్కడ హోంపేజీలో 'Phase 2 seat allotment result' లింక్ మీద క్లిక్ చేయాలి.
✦ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి లాగిన్ కావాలి.
✦ అక్కడ సీట్ల కేటాయింపు ఫలితాలు చూసుకోవచ్చు.
✦ అదేవిధంగా కళాశాలలవారీగా సీట్ల కేటాయింపు వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో కనిపిస్తాయి.
✦ సీట్ల కేటాయింపు ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
AP ICET 2023 Provisional Allotment Order(Download) & Self Reporting
రిపోర్టింగ్ సమయంలో కావాల్సిన డాక్యుమెంట్లు..
➥ ఏపీ ఐసెట్ 2023 హాల్‌టికెట్
➥ ఏపీ ఐసెట్ 2023 ర్యాంకు కార్డు
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
➥ డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్
➥ ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల మెమో
➥ పదోతరగతి మార్కుల మెమో
➥ 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్
➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్
➥ కులధ్రువీకరణ సర్టిఫికేట్
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
➥ లోకల్ సర్టిఫికేట్
➥ NCC/CAP, మైనార్టీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.
ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్(AP ICET)-2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 49,162 మంది దరఖాస్తు చేసుకోగా.. 44 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 8 నుంచి అక్టోబరు 4 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ఐసెట్ 2023 ప్రవేశాలకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 19,021 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో 17,143 మంది అభ్యర్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో 15,777 మంది విద్యార్ధులకు సీట్లు కేటాయించారు. మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి నవంబరు 15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించి నవంబరు 23న సీట్లను కేటాయించారు. సీట్లు పొందినవారు నవంబరు 25లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్(AP ICET)-2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 49,162 మంది దరఖాస్తు చేసుకోగా.. 44 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 8 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
(Note: T & C Apply)