News
News
వీడియోలు ఆటలు
X

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇటీవల జరిగిన కేబిట్ సమావేశంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి ఆమోదించింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇటీవల జరిగిన కేబిట్ సమావేశంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి కేబినేట్ ఆమోదించింది. ఇందులో భాగంగా 5388 పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ 6,000ల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం (మార్చి 20) విడుదల చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీకానుంది. పూర్తి పారదర్శకంగా ఈ నియామకాలను చేపట్టనుంది.

నియామకాల్లో వీరికి ప్రాధాన్యం..
ఇప్పటికే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న అయా భర్తకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. గ్రామం/వార్డులో మాజీ-సేవా పురుషులకు రెండవ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేనిపక్షలో పేరెంట్స్ కమిటీ ఇతర అర్హత గల వ్యక్తిని నియమించవచ్చు. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్, ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు.

ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం “మన బడి నాడు-నేడు”. 2020-21 నుండి అమలు చేస్తోంది. దీనిద్వారా పాఠశాలల్లో నీటి లభ్యత, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు; విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్‌లు, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసింది.

'మనబడి నాడు-నేడుస మొదటి దశలో 15,715 పాఠశాలలకు రూ. 3,669 కోట్లు, రెండో దశలో 22,228 కింద రూ.9,860 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ఇక మిగిలిన పాఠశాలలను ఫేజ్-3లో చేపట్టనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి పథకం కింద అన్ని పాఠశాలలకు పారిశుద్ధ్య కార్మికుల ఆయాలను నియమించడమే కాకుండా క్లీనింగ్ కెమికల్స్, క్లీనింగ్ టూల్స్ అందజేస్తున్నారు. నాడు నేడు రెండో దశలో భాగంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలే కాకుండా ఇంటరాక్టివ్ ఫ్లా ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ ట్యాబ్‌లు కూడా అందజేసింది.

అయితే కొన్ని పాఠశాలల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, నాడు నేడు కింద అందించే పాఠశాలల్లోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని.. కొన్ని చోట్ల మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు, సంఘ విద్రోహశక్తులు బడి ముగిసే సమయాల్లో కూడా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి పాఠశాల వాతావరణానికి అనుకూలించకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఫర్నీచర్‌, చరాస్తులను ధ్వంసం చేస్తున్నారు. వీటివల్ల రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.

పాఠశాలల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేసింది. అందువల్ల ఖరీదైన ఫర్నిచర్‌ను రక్షించాల్సిన అవసరం ఉంది. కావున, ఈ వస్తువులన్నింటిని రక్షించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి మొగ్గు చూపింది. మొత్తం 5,388 నాడు నేడు హైస్కూల్‌లలో పాఠశాలకు ఒక నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 21 Mar 2023 01:07 AM (IST) Tags: Education News in Telugu AP Govt Jobs 2023 Night Watchman Posts ZP Govt High Schools

సంబంధిత కథనాలు

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్‌ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!

Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్‌ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Medical Colleges: దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

Medical Colleges: దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!