అన్వేషించండి

యూనివర్సిటీ అధ్యాపకులకు గుడ్ న్యూస్, ఉద్యోగ విరమణ వయసు పెంచిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జులై 29న ఉత్తర్వులు జారీచేసింది..

ఏపీలోని విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు జులై 29న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు అందులో పేర్కొంది.

ఏపీ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమేరకు ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ లకు ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ:

సీఎం జగన్ సభకు పిల్లల తరలింపుపై పిటిషన్ - నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు

అమ్మఒడి కార్యక్రమానికి స్కూల్ పిల్లలను తరలించడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అనుమతించింది. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ , హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.  ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేసుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం విచారించింది.  ధర్మాసనం ముందు న్యాయవాది జడ శ్రావణ కుమార్ వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న సభకు పిల్లలను తరలించడం చట్టవిరుద్ధమని ధర్మాసనానికి తెలిపారు.  గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని శ్రావణ కుమార్ వాదించారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ల నమోదును జులై 30 వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.28లక్షల మంది నమోదు చేసుకున్నారు. ప్రవేశాలు తక్కువగా ఉన్నందున ఈ మేరకు పొడిగించింది. ఇప్పటివరకు ఆప్షన్లు నమోదుచేయలేకపోయిన విద్యార్థులకు ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే లక్షా 25వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొదటి షెడ్యూలు నాటికి కేవలం 80 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువును పొడిగించడంతో మరో 45వేల మంది మంది దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ప్రకటన విడుదల - దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ రామిరెడ్డి దూరవిద్య కేంద్రం (ఓయూసీడీఈ) ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించి జులై 28 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సు్ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget