AP ECET Results: ఏపీ ఈసెట్-2024 ఫలితాలు విడుదల, 90.41 శాతం ఉత్తీర్ణత నమోదు - ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
AP ECET Results: ఏపీలో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
AP ECET 2024 Rank Cards: ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2024' పరీక్ష ఫలితాలు నేడు (మే 30) విడుదలయ్యాయి. అనంతపురం జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఫలితాలను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్ట్రీమ్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 89.35 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 93.34 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.
AP ECET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఈసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx
Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే AP ECET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.
Step 4: ఈసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈసెట్ ప్రాథమిక కీని, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను జేఎన్‌టీయూ అనంతపురం మే 10న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మే 12 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఫలితాలను వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం ఏపీఈసెట్ 2024 నోటిఫికేషన్ మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 15 నంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇక రూ.500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈసెట్ పరీక్ష రాయడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకున్నారు. జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది.
పరీక్ష విధానం:
➥ ఈసెట్ ప్రవేశ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహించారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స 50 ప్రశ్నలు - 50 మార్కులు, ఫిజిక్స్ 25 ప్రశ్నలు - 25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు - 25 మార్కులు ఉంటాయి. ఇక విద్యార్థులకు సంబంధించిన విభాగం నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
➥ ఇందులో ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్ నుంచి 50 ప్రశ్నలు - 50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు - 50 మార్కులు, ఫార్మాకాగ్నసీ నుంచి 50 ప్రశ్నలు - 50 మార్కులు, ఫార్మాకాలజీ నుంచి 50 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి.
➥ బీఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథమెటిక్స్ నుంచి 100 ప్రశ్నలు - 100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు - 50 మార్కులు, కమ్యూనికేషన్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి.
అర్హత మార్కులు..
పరీక్షలో కనీస అర్హత మార్కులను 25% (50 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.