AP EAPCET Results 2023: ఏపీ ఈఏపి సెట్ ఫలితాలు విడుదల- నీట్ టాపర్ వరుణ్‌కు రెండో ర్యాంక్
AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాలను ఇవాళ (జూన్ 14న) వెల్లడయ్యాయి. రిజల్ట్స్‌ను ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.
AP EAPCET Results 2023: ఏపీ ఈఏపి సెట్ 2023 ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఈ సెట్‌ను నిర్వహించింది. గత నెల 15 నుంచి 24 వరకు ఏపీ ఇంజినీరింగ్ , అగ్రికల్చర్ ఫార్మసీ అడ్మిషన్‌ల కోసం ఎంట్రన్స్ పరీక్షలు విద్యార్థు రాశారు.
మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికి (93.38 శాతం) పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది; ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను మే 24న విడుదల చేశారు. అదేవిధంగా మే 24 నుంచి 26 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ కోసం 2 లక్షల 38 వేల 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో బాలికలు 1 లక్ష 69 వేల 302 మంది ఈ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో అబ్బాయిలే సత్తా చాటారు.
ఇంజినీరింగ్‌లో మొదటి పది ర్యాంకర్‌లు
చల్లా ఉమేష్ వరుణ్- 158 మార్కులు
అభినవ్ చౌదరి- 157 మార్కులు
నండిపాటి సాయి దుర్గా రెడ్డి -155 మార్కులు
చింతపాటి బాబు సృజన్ రెడ్డి- 155మార్కులు
దుగ్గినేని వెంకట యోగేష్- 150 మార్కులు
అడగడ్డ వెంకట శివరాం - 153 మార్కులు
ఎక్కింటి ఫణి వెంకట మనిచంద్రా రెడ్డి 153 మార్కులు
మెడపురం లక్ష్మి నరసింహ భరద్వాజ్ 153 మార్కులు
శశాంక్ రెడ్డి- 152 మార్కులు
ఎం శ్రీకాంత్- 152 మార్కులు
అగ్రికల్చర్‌లోటాప్ ర్యాంకర్లు
సత్యరాజ జశ్వంత్ (కాతేరు)
వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
రాజ్‌కుమార్ (సికింద్రాబాద్)
సాయి అభినవ్ (చిత్తూరు)
కార్తికేయరెడ్డి (తెనాలి)