AP EAPCET: ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు మే 26 వరకు అవకాశం
AP EAPCET: ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచారు.
![AP EAPCET: ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు మే 26 వరకు అవకాశం ap eapcet 2024 engieering stream master question papers and preliminary keys released last date for the receipt of objections is 26th may AP EAPCET: ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు మే 26 వరకు అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/f55453144cb2592492e34069bc93855f1716528333011522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP EAPCET 2024 Engineering Stream Answer Key: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు మే 23తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేసిన అధికారులు మే 24న ఉదయం 10 గంటలకు ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం ఇచ్చారు.
Master Question Papers With Preliminary Keys
మే 25 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ ఆన్సర్ కీ అభ్యంతరాలకు అవకాశం..
ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించి మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 25న ఉదయం 10 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు 93.47 శాతం అభ్యర్థులు హాజరు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 16న ప్రారంభమైన ఎప్‌సెట్ పరీక్షలు మే 23తో ముగిశాయి. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,39,139 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 93.47 శాతం హాజరు నమోదైంది. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇంటర్ మార్కులకు వెయిటేజీ..
ఏపీ ఎప్‌సెట్-2024లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇతర బోర్డులకు సంబంధించిన విద్యార్థులు తమ ఇంటర్ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే పరిష్కరించేందుకు ఫోన్ నెంబర్లు: 0884-2359599, 2342499 అందుబాటులో ఉంచారు. వీటిద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
ALSO READ:
ఏపీ హార్టిసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టిసెట్-2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టిసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 101 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 61 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 22న ప్రారంభంకాగా.. జూన్ 15న సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)