AP EAMCET Counselling 2021: ఏపీ ఎంసెట్ రెండో రౌండ్ కౌన్సెలింగ్.. విద్యార్థులు చేయాల్సిన పని ఇదే..
ఏపీ ఎంసెట్ రెండో రౌండ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్.. ఇంజినీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎంసెట్(EAPCET-2021) అడ్మిషన్ల కోసం.. కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభమైంది. మెుదటి విడతకు సంబందించిన ఫలితాలు గతంలోనే విడుదలయ్యాయి. డిసెంబరు 3, 2021 నాటికి రెండో విడత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
డిసెంబరు 5 వరకు కాలేజీ, కోర్సు ఆఫ్షన్ ఎంట్రీలను నమోదు చేసుకోవాలి. ఈ కౌన్సెలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం.. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. తప్పకుండా AP EAPCET అధికారిక వెబ్‌సైట్ లోనే చేయాల్సి ఉంటుదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
AP EAPCET వెబ్‌సైట్ కు వెళ్లండి.. హోమ్‌పేజీలో అభ్యర్థుల నమోదు చివరి దశ కౌన్సెలింగ్ లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి, సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫారం కాపీని విద్యార్థులు ప్రింట్ తీసుకుంటే మంచిది.
- డిసెంబరు 6న ఆప్షన్లు మార్చుకునేందుకు ఛాన్స్ ఉంది.
- డిసెంబరు 9న సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడుతాయి. ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ సాంకేతిక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటే.. మళ్లీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
కౌన్సెలింగ్ సమయంలో ఏపీ ఎంసెట్- 2021 ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్(టీసీ), పదో తరగతి మార్కుల మెమో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్( వర్తించే వారు మాత్రమే తీసుకెళ్లాలి), నివాస ధ్రువీకరణ పత్రం, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లాంటి పత్రాలు అవసరం ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సినవి..
- ఏపీ ఎంసెట్ 2021 తుదివిడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్-డిసెంబరు 2 నుంచి 3 వరకు ఉంటుంది.
- సర్టిఫికెట్స్ ఆన్‌లైన్ వెరిఫికేషన్- డిసెంబరు 3 నుంచి 4 వరకు ఉంటుంది.
- వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ- డిసెంబరు 5 వరకు.
- వెబ్ ఆప్షన్ ఎంట్రీలో మార్పులు మార్పులు చేసుకునే అవకాశం- డిసెంబరు 6
- ఏపీ ఎంసెట్ 2021 సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడేది- డిసెంబరు 9
Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే..
Also Read: Internship: ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలెక్కువ.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రముఖ కంపెనీల్లో చేసేయండి
Also Read: స్నేహితుడికి ఉద్యోగమెుచ్చింది.. నాకెందుకు రాలేదనే పోలిక కాదు.. ఎక్కడ వెనకపడ్డారో చూసుకోండి