AP CETS 2025: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
APCETS: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.

AP CETS 2025 Dates: ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. రాష్ట్రంలో మే 6 నుంచి జూన్ 13 మధ్య పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ), బాల్ పాయింట్ పెన్ను (బ్లాక్, బ్లూ) వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 6న ఏపీఈసెట్ (AP ECET); మే 7న ఏపీ ఐసెట్ (APICET); మే 19 నుంచి 27 మధ్య ఏపీఈఏపీసెట్ (AP EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు మే 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి మే 21, 24, 26, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక జూన్ 5న లాసెట్/పీజీఎల్‌సెట్ (AP LAWCET/PGLCET) పరీక్షలు నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్ పరీక్ష కూడా జూన్ 5న నిర్వహించనున్నారు. అదేవిధంగా జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్ (PGECET) పరీక్షలు, జూన్ 9 నుంచి 13 వరకు పీజీసెట్ (AP PGCET) పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి కీలక సూచనలు చేసింది.
* మే 6న నిర్వహించే ఏపీఈసెట్ పరీక్షను రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
* మే 7న నిర్వహించే ఏపీ ఐసెట్ పరీక్షను రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
* మే 19 నుంచి 27 మధ్య ఏపీఈఏపీసెట్ (AP EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు మే 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి మే 21, 24, 26, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
* జూన్ 5న లాసెట్/పీజీఎల్‌సెట్ (AP LAWCET/PGLCET) పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 10.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
* జూన్ 5న ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
* జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్ (PGECET) పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి.
* జూన్ 9 నుంచి 13 వరకు పీజీసెట్ (AP PGCET) పరీక్షలు మూడు సెషన్లలో జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.






















