News
News
వీడియోలు ఆటలు
X

AP PGCET: ఏపీ పీజీసెట్-2023 నోటిఫికేషన్ విడుదల - పరీక్ష, కోర్సుల వివరాలు ఇలా!

పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ పీజీసెట్) షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ పీజీసెట్) షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమై మే 11న ముగియనుంది. ప్రవేశ పరీక్షలు జూన్ 6న ప్రారంభం కానున్నాయి. ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. 

కంప్యూటర్ ఆధారిత(సీబీటీ) విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపీఈడీకి రాతపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు.

ప్రవేశాలు పొందే యూనివర్సిటీలు...
ఆంధ్ర యూనివర్సిటీ (విశాఖపట్నం), డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి), డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (కర్నూలు), శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(అనంతపురం), ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం), ఆచార్య నాగార్జన యూనివర్సిటీ (గుంటూరు), కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్నం), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి), ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమహేంద్రవరం), యోగి వేమన యూనివర్సిటీ (కడప), క్లస్టర్ యూనివర్సిటీ (కర్నూలు), రాయలసీమ యూనివర్సిటీ (కర్నూలు), ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ (ఒంగోలు), విక్రమ సింహపురి యూనివర్సిటీ (నెల్లూరు), జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్- ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి).

పరీక్ష వివరాలు..

➥ ఏపీ పీజీసెట్ - 2023

పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్ తదితరాలు.

అర్హత: సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది పరీక్ష రాస్తున్నవారు అర్హులు.

పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీలకు రూ.850; బీసీలకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650.

పరీక్ష విధానం: లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్ష 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది. నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 11.05.2023.

➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 21.05.2023.

➥ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: ప్రకటించాల్సి ఉంది.

➥ ప్రవేశ పరీక్షలు ప్రారంభం: 06.06.2023.

Notification
Website

Also Read:

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
ఏపీలో లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 22న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. అభ్యర్థుల నుంచి మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 29 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 9 వరకు  దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్‌ చేసుకునేందుకు మే 10 నుంచి 11 వరకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
లాసెట్ దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్‌-2023' నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష బాధ్యత నిర్వహిస్తోంది. ఏపీ ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 24న ప్రారంభంకాగా.. ఏప్రిల్‌ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. అయితే రూ.1000ల ఆలస్య రుసుముతో మే 2 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 10 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. పరీక్ష హాల్‌టికెట్లు మే 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ఎడ్‌సెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 02 Apr 2023 09:18 PM (IST) Tags: APPGCET-2023 Notification APPGCET-2023 Application APPGCET-2023 Schedule APPGCET-2023 Exam Dates

సంబంధిత కథనాలు

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!