SA2 Exams in Andhra Pradesh: ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్-2 పరీక్షలు, షెడ్యూలు విడుదల చేసిన విద్యాశాఖ
Andhra Pradesh News: ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
AP SA2 Exams: ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..
➥ ఏప్రిల్ 6 నుంచి 16 వరకు 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
➥ ఏప్రిల్ 6 నుంచి 18 వరకు 6 - 8 వ తరగతులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ ఏప్రిల్ 19న కాంపొజిట్ కోర్సు విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 8, 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు; 6, 7వ తరగతులకు కేవలం ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.
ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..
ఏప్రిల్ 6న: ఫస్ట్ లాంగ్వేజ్.
ఏప్రిల్ 8న: ఇంగ్లిష్ పార్ట్-ఎ.
ఏప్రిల్ 10న: ఇంగ్లిష్ పార్ట్-బి (టోఫెల్).
ఏప్రిల్ 12న: మ్యాథమెటిక్స్.
ఏప్రిల్ 13న: పర్యావరణ శాస్త్రం(ఈవీఎస్) (3, 4, 5వ తరగతులకు).
ఏప్రిల్ 15న: ఓపెన్ స్కూల్ (3, 4, 5వ తరగతులకు)
ఏప్రిల్ 16న: SLAS 2024 (గ్రేడ్-4 విద్యార్థులకు)
6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..
ఏప్రిల్ 6న: ఫస్ట్ లాంగ్వేజ్.
ఏప్రిల్ 8న: సెకండ్ లాంగ్వేజ్.
ఏప్రిల్ 10న: ఇంగ్లిష్ పార్ట్-ఎ.
ఏప్రిల్ 12న: ఇంగ్లిష్ పార్ట్-బి (టోఫెల్).
ఏప్రిల్ 13న: మ్యాథమెటిక్స్.
ఏప్రిల్ 15న: జనరల్ సైన్స్/ఫిజికల్ సైన్స్ (3, 4, 5వ తరగతులకు)
ఏప్రిల్ 16న: బయోలాజికల్ సైన్స్.
ఏప్రిల్ 18న: సోషల్ స్టడీస్.
ఏప్రిల్ 19న: కాంపొజిట్ కోర్సు పరీక్ష. ఇందులో 8, 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు; 6, 7వ తరగతులకు కేవలం ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.
మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు..
ఈ ఏడాది ఏపీలో మార్చి 18 నుంచి 31 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గం. వరకు పదోతరగతి పరీక్షలు నిర్ణయించారు. ఈసారి పదోతరగతి విద్యార్థులకు 7 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు..
➥ మార్చి 18: ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
➥ మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్
➥ మార్చి 20: ఇంగ్లీష్
➥ మార్చి 22: తేదీ మ్యాథమెటిక్స్
➥ మార్చి 23: ఫిజికల్ సైన్స్
➥ మార్చి 26: బయాలజీ
➥ మార్చి 27: సోషల్ స్టడీస్ పరీక్షలు
➥ మార్చి 28: మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
➥ మార్చి 30: ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష