APMS Inter Admissions: ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్' ప్రవేశాలు - మార్చి 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
APMS Inter Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పతోతరగతి అర్హత ఉన్న విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మార్చి 22న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పదోతరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. విద్యార్థులు నిర్ణీత తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ సూచించారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్య అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్య బోధిస్తారు.
వివరాలు..
* ఏపీ ఆదర్శపాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు
అర్హతలు: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ALSO READ
6వ తరగతి దరఖాస్తుకు మార్చి 31 వరకు అవకాశం..
ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడిన సంగతి తెలిసిందే. విద్యార్థులు మార్చి 1 నుండే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమూంది. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధిస్తారు, చదువుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. ఈ పాఠశాలలన్నీ కూడా సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి.
ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 1 నుంచి31 వరకు నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కేటాయించిన జనరల్ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్ నెట్ కేంద్రంలో www.cse.ap.gov.in లేదా apms.ap.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..