అన్వేషించండి

Private University Fees: ప్రైవేటు యూనివర్సిటీ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారమే ఇకపై ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాలో ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లిస్తోంది

ఏపీలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ మేరకు జనవరి 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారమే ఇకపై ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాలో ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లిస్తోంది. వీటిలో ఎస్‌ఆర్‌ఎం, విట్, సెంచూరియన్, భారతీయ, క్రియ, మోహన్‌బాబు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల్లో ప్రభుత్వం కల్పించే కన్వీనర్ కోటా 35 శాతం ప్రవేశాలకు ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఇలా..

క్రియాలో ఎంబీఏ, బీఏ, బీఎస్సీ కోర్సులకు రూ.70,000 గా నిర్ణయించింది.

➥సెంచూరియన్‌లో బీబీఏకు రూ.25,000 గా; ఎస్‌ఆర్‌ఎంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏలకు రూ.30,000 గా; ఎంటెక్, ఎంబీఏలకు రూ.70,000 గా ఫీజులు నిర్ణయించింది. 

విట్‌లో బీకాం, బీఎస్సీ-ఎంఎస్సీ, బీఏ-ఎంఏలకు రూ.30,000, ఎల్‌ఎల్‌బీ, బీబీఏకు రూ.40,000; ఎంటెక్‌ ఫీజును రూ.70,000, ఎంఎస్సీకి రూ.50,000 గా ఫీజును ఖరారు చేసింది. 

➥ భారతీయ వర్సిటీలో బీబీఏ, బీసీఏలకు రూ.25,000; బీఎస్సీ కోర్సుకు రూ.40,000, బీబీఏ+ఎంబీఏకు రూ.30,000; ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులకు రూ.40,000 చొప్పున ఫీజు నిర్ణయించింది.

మోహన్‌బాబు వర్సిటీలో ఎంటెక్‌ ఫీజును రూ.70,000 గా నిర్ణయించగా.. బీసీఏకు రూ.25,000, ఎంసీఏకు రూ.40,000; బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం కోర్సులకు రూ.20,000 ఫీజును ఖరారుచేసింది. ఇక ఎంఎస్సీ కోర్సుకు రూ.30,000; బీబీఏ కోర్సుకు రూ.25,000; ఎంబీఏ కోర్సుకు రూ.40,000; బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సులకు రూ.35,000 గా ఫీజు నిర్ణయించగా.. ఎంఫార్మసీ ఫీజును రూ.70,000గా ప్రభుత్వం నిర్ణయించింది. 

Also Read:

AP Inter Practicals: ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్! కొత్త షెడ్యూలు ఇదే!
ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ మారింది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి  మార్చి 7 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను 10 రోజుల పాటు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షల తేదీలను కూడా ఇంటర్ బోర్డు మార్చింది. వీటిలో ఫిబ్రవరి 22న నిర్వహించాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 15న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరి 24న నిర్వహించాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. థియరీ పరీక్షలు యథావిధిగా షెడ్యూలు ప్రకారమే కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget