అన్వేషించండి

APFU Admissions: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ప్రవేశాలు, ఈ అర్హతలు అవసరం

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎప్‌సెట్‌ ర్యాంకు, రిజర్వేషన్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

Andhra Pradesh Fisheries University  BFSc Admissions: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ) క్యాంప్ ఆఫీస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంక్ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్యరుసుముతో ఆగస్టు 9 వరకు దరఖాస్తుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఆలస్యరుసుము కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

కోర్సు వివరాలు..

* బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ)

కళాశాల, సీట్ల వివరాలు..

కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు (ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): 40 సీట్లు 

కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): 60 సీట్లు

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు)

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్

అర్హత: ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2023 ర్యాంక్ సాధించి ఉండాలి.

వయోపరిమితి..
* 31.12.2024 నాటికి 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 31.12.2007 - 31.12.2002 మధ్య జన్మించి ఉండాలి. 
* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు 31.12.2007 - 31.12.1999 మధ్య జన్మించి ఉండాలి. 
* దివ్యాంగులైతే 27 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు 31.12.2007 - 31.12.1997 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఆలస్యరుసుము కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ప్రవేశ సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు..

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత మార్కుల మెమో, పాస్ సర్టిఫికేట్

➥ AP EAPCET 2024 హాల్‌టికెట్

➥ AP EAPCET 2024 ర్యాంకు కార్డు

➥ పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష సర్టిఫికేట్

➥ కమ్యూనిటీ/క్యాస్ట్ సర్టిఫికేట్ (బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు)

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్

➥ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సంబంధించిన సర్టిఫికేట్లు

➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (చివరగా చదివిన కాలేజీ/స్కూల్ నుంచి) 

➥ ఫార్మర్స్ కోటా కింద చేరేవారు ఫారమ్-I, ఫారమ్-II సమర్పించాలి.

➥ ఒరిజినల్ పట్టాదార్ పాస్‌బుక్ లేదా అడంగల్/1B సమర్పించాలి.

➥ స్పెషల్ కేటగిరీ (CAP/NCC/PH/స్పోర్ట్స్ & గేమ్స్, స్కౌట్స్ & గైడ్స్) కింద ప్రవేశాలు కోరేవారు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లు కలిగి ఉండాలి. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 07.08.2024.

➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2024.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget