News
News
వీడియోలు ఆటలు
X

AIBE 17 Result: ఏఐబీఈ-XVII పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)-XVII పరీక్ష ఫలితాలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

FOLLOW US: 
Share:

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)-XVII పరీక్ష ఫలితాలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఏఐబీఈ-XVII  పరీక్షను ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు సమయంలో ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ సరిగా అప్‌లోడ్ చేయని అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. వారు మే 15లోగా తమ సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మే 20న ఈ అభ్యర్థుల ఫలితాలను వెల్లడిస్తారు. మే 15లోగా అప్‌లోడ్ చేయని అభ్యర్థుల ఫలితాలను మే 30న వెల్లడిస్తారు. పరీక్ష ఫైనల్ కీ ఆధారంగా అభ్యర్థులకు మార్కులు కేటాయించారు. దీనిప్రకారమే ఫలితాలను వెల్లడించారు.

ఏఐబీఈ-XVII పరీక్ష ఫలితాలు ఇలా చూసుకోండి..

Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -https://allindiabarexamination.com/

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'AIBE-XVII' ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 

Step 4: కంప్యూటర్ స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి. 

Step 5: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునేవారు రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో ఏడాది తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ నిర్వహించే ఏఐబీఈ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏఐబీఈ-XVII పరీక్ష నిర్వహించారు. పరీక్ష ఆన్సర్ కి ఫిబ్రవరి 13న విడుదల చేశారు. ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఆన్సర్ కీపై అభ్యంతరాల అనంతరం 2 ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం 98 మార్కులకే మార్కులను ప్రామాణికంగా స్వీకరించింది. ఆ మేరకు ఫలితాలు వెల్లడించింది.

Also Read:

ఏపీ ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈసారి ఎన్ని సెలవులంటే?
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి‌ 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ఇంటర్ పూర్తి క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 29 Apr 2023 03:38 PM (IST) Tags: AIBE XVII Result Date AIBE XVII Result 2023 Date and Time AIBE XVII Result 2023 AIBE XVII 2023 Result AIBE 17 Result Date AIBE 17 Result 2023 Date and Time AIBE 17 Result 2023

సంబంధిత కథనాలు

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్