అన్వేషించండి

AP LAWCET 2024: ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే

ఏపీలోని న్యాయ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైంది. ఈ ఏడాది జూన్ 9న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

AP LAWCET Notification: ఏపీలోని న్యాయ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ (AP LAWCET 2024/PGLCET 2024) నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైంది. దీనిద్వారా ఏపీలోని లా కాలేజీల్లో 3, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ డిగ్రీ కోర్సులు, 2 సంవత్సరాల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది జూన్ 9న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 25 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

లాసెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ.900; బీసీ అభ్యర్థులు రూ.850; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో మే 4 నుంచి 11 వరకు, రూ.2000 అపరాధ రుసుంతో మే 12 నుంచి 20 వరకు, రూ.3000 అపరాధ రుసుంతో మే 21 నుంచి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే మే 30 నుంచి జూన్ 1 వరకు మార్పులు చేసుకోవచ్చు. జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9 మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో లాసెట్/పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు..

* ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్‌సెట్ - 2024 (AP LAWCET/ AP PGLCET 2024)

కోర్సుల వివరాలు..

1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- ఎల్‌ఎల్‌బీ 

- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)

అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

- బీఏ ఎల్‌ఎల్‌బీ

- బీకామ్ ఎల్‌ఎల్‌బీ

- బీబీఏ ఎల్‌ఎల్‌బీ

అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు

అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: 

➦ లాసెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.

➦ పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

లాసెట్ పరీక్ష విధానం:
➥ మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-బి: కరెంట్ ఎఫైర్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-సి: ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా) 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పార్ట్-సిలో బేసిక్ లా ప్రిన్సిపుల్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.  తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

➥ ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.

పీజీఎల్‌సెట్ పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో మొత్తం 2 సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ నుంచి 40 పశ్నలు, పార్ట్-బి నుంచి 80 పశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు. 

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 22.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.04.2024.

➥ రూ.500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 03.05.2024. 

➥ రూ.1000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 11.05.2024.

➥ రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 20.05.2024.

➥ రూ.3000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 29.05.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.05.2024 - 01.06.2024.

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 03.06.2024 నుంచి.

➥  పీజీఈసెట్ పరీక్ష తేది: 09.05.2024 వరకు.

(పరీక్ష సమయం: మ. 02.30 గం. . సా. 4.00 గం. వరకు.)

AP LAWCET 2024: ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
Embed widget