అన్వేషించండి
Crime News: పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోసి చంపేస్తా! యువకుడి బెదిరింపులతో యువతి ఇంటికి తాళం
Khammam News: వి.యం.బంజరలో యాసిడ్ సీసాతో బాలిక ఇంటి ముందు యువకుడు హల్‌చల్ చేశాడు. తనను కాదని వేరొకరికి ఇచ్చి పెళ్లిచేస్తే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు.

ప్రతీకాత్మక చిత్రం
Source : X
Threats of acid attack: ప్రేమించిన యువతిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే...యాసిడ్ పోసి చంపేస్తానంటూ ఓ యువకుడు హల్ చల్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. అతని ఉన్మాద చేష్టలకు భయపడిపోయిన బాలిక, ఆమె తల్లి ఇంటికి గేటుకు తాళం వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
జులాయి హల్‌చల్
ఖమ్మం(Khammam) జిల్లా V.M. బంజరకు చెందిన బొర్రా సాయిమహేందర్(Sai Mahendra) పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పదోతరగతి వరకు చదివిన సాయి మహేందర్....ఆ తర్వాత చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అప్పటి నుంచి ఏ పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
ఆదివారం ఓ బాలికను ప్రేమించాలంటూ ... లేకుంటే చంపేస్తానంటూ కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంటర్ చదువుతున్న బాలిక...పరీక్షలు దగ్గరపడటంతో ఆదివారం అయినప్పటికీ ప్రత్యేక తరగతుల కోసం కళాశాల(College)కు వెళ్లింది. అక్కడికి మద్యం తాగి వెళ్లిన సాయిమహేందర్...ఆ బాలిక బయటకు రావాలంటూ కత్తితో హడావుడి చేశాడు. బయటకు రాకుంటే చంపేస్తానంటూ ఉన్నాదిగా ప్రవర్తించాడు. కత్తి(Knife)తో తన చేతులనే కోసుకుంటూ పిచ్చిగా ప్రవర్తించాడు.దీంతో బయపడిపోయిన బాలిక...వాడి బారీ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం తల్లికి చెప్పి బోరున విలపించింది. మళ్లీ ఆ ఉన్మాది ఇంటికి వస్తాడేమోనని భయపడిపోయిన తల్లీ,కుమార్తె ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. కొద్దిసేపటకి అక్కడికి చేరుకున్న సాయిమహేందర్...ఈసారి యాసిడ్ సీసా, కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయికి వేరే పెళ్లి చేస్తే యాసిడ్ పోసి చంపుతానంటూ బెదిరించాడు. తనతోనే పెళ్లి చేయాలంటూ హంగామా సృష్టించాడు. కాసేపటికి సృహతప్పి బాలిక ఇంటి ముందే పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు(Police) అక్కడికి చేరుకుని 108 వాహనంలో యువకుడిని పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. సాయి మహేందర్‌తో తమకు ప్రాణహాని ఉందని బాధితురాలి తల్లి V.M బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జీవితాలతో చెలగాటం
తెలిసీతెలియని వయసులో ఆకర్షణకు లోనైన యువతీ, యువకులు అదే ప్రేమగా భావిస్తున్నారు. ఒప్పుకోకపోయిన భాగస్వాములను బెదిరించడం లేదా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యుక్త వయసు రాకముందే పెళ్లి,కాపురమంటూ జీవితాలను బలితీసుకుంటున్నారు. చిన్నచిన్న విషయాలకే మనస్పర్థలు తెచ్చుకోవడం విడిపోవడం...ఆ బాధలో చెడు అలవాట్లకు యువత బానిసలవుతున్నారు.
ఇటీవలకాలంలో యాసిడ్ దాడులు తగ్గినప్పటికీ ఖమ్మం జిల్లాలో యువకుడు మరోసారి యాసిడ్ సీసాతో హల్‌చల్ చేయడం భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే విశాఖలో ఓ అంగన్‌వాడీ టీచర్‌పై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడిచేయగా...ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఓ యువతి వేసుకున్న దుస్తులు నచ్చలేదని...మరోసారి ఇలాంటి దుస్తులు వేసుకుంటే యాసిడ్ దాడిచేస్తానంటూ బెదిరించిన బెంగళూరు యువకుడు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఆ యువతి దుస్తులపై కామెంట్ చేసిన నికిత్‌శెట్టిపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెటిజన్లు సైతం ఆ యువతికి మద్దతుగా నిలిచారు. అతడు పనిచేస్తున్న ఎటియోస్ డిజిటల్ సర్వీసెస్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో సదరు సంస్థ నికిత్‌శెట్టిని ఉద్యోగం నుంచి తొలగించింది. యాసిడ్ దాడికి పాల్పడినా, బెదిరించినా....కఠినమైన శిక్షలు పడనున్నాయి.
ఇంకా చదవండి





















