అన్వేషించండి

Eluru News: ఏలూరు జిల్లాలో దారుణం - యువతిపై కత్తితో దాడి, అనంతరం గొంతు కోసుకున్న ప్రేమోన్మాది

Andhrapradesh News: ఏలూరులో ఓ యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Murdered Woman In Eluru: ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా సంత్రపాడులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు (Eluru) నగరంలోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన యువతి (22) స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తోంది. గురువారం నగరంలోని సత్రంపాడు సాయిబాబా గుడి వద్ద తొట్టిబోయిన యేసురత్నం (23) అనే యువకుడు యువతిపై విచక్షణా రహితంగా పలుమార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతోనే యువకుడు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

యువకుడు పలుమార్లు తమ ఇంటికి వచ్చి తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని అడిగాడని యువతి తల్లిదండ్రులు తెలిపారు. అయితే, తాము పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష గట్టి ఇలా దారుణంగా తమ అమ్మాయిని చంపేశాడని కన్నీరుమున్నీరుగా విలపించారు. మా అమ్మాయి జోలికి రాకుండా యువకుడి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు వెల్లడించారు. కాగా, యువతి, యువకుడు ప్రేమించుకున్నారని.. వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే మరో వాదనా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే యువతి గొంతు కోసిన యువకుడు అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. పోలీసుల విచారణలోనే అసలు నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.  ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. 

Also Read: Hyderabad News: హృదయ విదారకం - పాల ప్యాకెట్ కోసం చిన్నారితో కలిసి వెళ్లిన తండ్రి, చివరకు రోడ్డు ప్రమాదంలో

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget