Viral News: భర్తను కాళ్లుచేతులు విరగ్గొట్టించి సజీవ సమాధి చేయాలనుకున్న భార్య - చివరిలో బతికిపోయాడు !
UP Crime News: భర్తలను చంపేందుకు భార్యలు క్రియేటివిటీ చూపిస్తున్నారు. భర్తను సజీవంగా పాతిపెట్టే ఓ నేరం చివరి క్షణంలో భగ్నం అయింది.

Plan to kill husband fails: దేశంలో ఇప్పుడు మొగుళ్లను చంపే సీజన్ నడుస్తోందేమో అన్నట్లుగా నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. తన భర్తను చంపడానికి మహిళ తన సోదరులు, తల్లితో కలిసి చేసిన కుట్ర ఫెయిలయిది. కానీ అతని పరిస్థితి విషమంగా మారింది.
రాజీవ్ అనే వ్యక్తి బరేలీలోని నవోదయ ఆసుపత్రిలో డాక్టర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 2009లో సాధనతో వివాహం అయింది. వీరికి 14 సంవత్సరాల యష్ 8 సంవత్సరాలల లవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నారు. అయితే, సాధన తన భర్త రాజీవ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది . ఐదుగురు సోదరులతో కలిసి ప్లాన్ చేశారు.
సాధన తన సోదరులతో కలిసి 11 మంది గూండాలను నియమించింది. ఈ గూండాలు జులై 21, 2025 రాత్రి రాజీవ్ ఇంటిపై దాడి చేశారు. వారు రాజీవ్‌ను కొట్టి, అతని ఒక చేయి . రెండు కాళ్లను విరగ్గొట్టారు. ఆ తర్వాత, వారు అతన్ని సజీవంగా పాతిపెట్టేందుకు సీబీ గంజ్ ప్రాంతంలోని ఒక అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ వారు ఒక గోతి తవ్వారు, రాజీవ్‌ను అందులో పాతిపెట్టడానికి సిద్ధమయ్యారు.
గోతి తవ్విన తర్వాత, రాజీవ్‌ను పాతిపెట్టే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఈ ఊహించని సంఘటనతో గూండాలు భయపడి, రాజీవ్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆ అపరిచితుడు రాజీవ్‌ను గమనించి, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి, అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. రాజీవ్ తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు . ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
#UPNews | यह घटना बरेली के इज्जतनगर थाना क्षेत्र में हुई। कथित तौर पर, उसकी पत्नी साधना ने हत्या की योजना बनाई थी और अपने पांच भाइयों - भगवान दास, प्रेमराज, हरीश और लक्ष्मण - को हत्या के लिए कुछ गुंडों को भाड़े पर भेजने के लिए राजी किया था।https://t.co/byVPdX1o0X#bareilly… pic.twitter.com/HVeiXS1Udv
— Moneycontrol Hindi (@MoneycontrolH) August 2, 2025
రాజీవ్ తండ్రి ఫిర్యాదు మేరకు, ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సాధన, ఆమె సోదరులపై కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనను హత్యాయత్నంగా గుర్తించి, విచారణ ప్రారంభించారు. అతని భార్య గ్రామంలో ఉండటానికి ఇష్టపడకపోవడంతో అతను నగరంలోని ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఎందుకు చంపాలనుకున్నారో మాత్రం ఇంకా బయటపడలేదు. ఆమె వివాహేతర బంధాలు ఏమైనా పెట్టుకుందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.





















