Sadistic Wife: భర్తను మంచానికి కట్టేసి భార్య వికృత చేష్టలు - వీడియో చూసి షాకైన పోలీసులు, నిందితురాలి అరెస్ట్
Up News: ఓ భార్య తన భర్తను చిత్ర హింసలకు గురి చేసింది. మంచానికి కట్టేసి సిగరెట్ తో కాల్చింది. ఈ దారుణ ఘటన యూపీలో జరగ్గా పోలీసులు భర్త అందించిన వీడియో ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేశారు.
Woman Tortured Her Wife In UP: ఓ భార్య తన భర్తను మంచానికి కట్టేసి వికృత చేష్టలకు పాల్పడిన ఘటన యూపీలో (UP) జరిగింది. దీనిపై సీసీ ఫుటేజీ ఆధారాలతో భర్త పోలీసులను ఆశ్రయించగా వీడియో చూసి షాక్ తిన్న పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ (Bijnor) ప్రాంతానికి చెందిన మెహెర్ జైన్ అనే మహిళను మన్నన్ జైదీ 2023, నవంబర్ 17న ముస్లిం సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లైన కొన్ని రోజులకే భర్తతో ఆమె బలవంతంగా వేరు కాపురం పెట్టించింది. మత్తు పదార్థాలకు బానిసైన ఆమె భర్తను నిత్యం వేధిస్తుండేది. భర్త మన్నన్.. ఆమెను చెడు అలవాట్లు మానుకోవాలని.. తన తల్లిదండ్రులతో కలిసి ఉందామని చెప్పినందుకు చిత్రహింసలు పెట్టింది. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేసేది. ఈ టార్చర్ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేదని బాధితుడు తెలిపాడు. దీనిపై భర్త మన్నన్ గత నెలలో పోలీసులను ఆశ్రయించాడు. అయితే, అతని ఫిర్యాదును పోలీసులు లైట్ తీసుకున్నారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా..
దీంతో భార్య తనను పెట్టే టార్చర్ ను ఆధారాలతో సహా పోలీసులకు చూపించాలని భర్త మన్నన్ భావించాడు. ఈ క్రమంలో ఇంట్లో భార్యకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ వీడియోలను పోలీసులకు చూపించగా.. భర్తను ఆమె పెట్టే టార్చర్ చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఆ వీడియో ప్రకారం.. 2024, ఏప్రిల్ 29న భార్య మెహర్.. మన్నన్ కు మత్తు మందు కలిపిన పాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అవి తాగిన వెంటనే అతను స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం మంచంపై అతని బట్టలు విప్పేసి చేతులు కట్టేసి పలుచోట్ల సిగరెట్ తో కాల్చింది. ఒంటిపై వాతలు పెట్టింది. స్పృహలోకి వచ్చిన తర్వాత భర్తను కత్తితో ప్రైవేట్ పార్ట్ పై గాయాలు చేయడం వీడియోలో కనిపించింది. తనను వదిలేయమని ప్రాధేయపడినా కనికరించలేదు. ఎలాగే ఆమె బారి నుంచి తప్పించుకున్న భర్త మన్నన్ ఈ వీడియోతో సహా పోలీసులను ఆశ్రయించాడు. ఇలానే రోజూ తనపై దాడి చేస్తోందని వారికి వివరించాడు.
నిందితురాలి అరెస్ట్
భర్త మన్నన్ అందించిన వీడియోను చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. భార్య మెహర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, తన కొడుకుని కోడలు రోజూ కొట్టేదని యువకుడి తండ్రి ఆరోపించారు. బెడ్ రూంలో అసభ్యకరమైన పనులు చేసేదని.. దీంతో మనస్తాపానికి గురైన కొడుకు తన భార్య అకృత్యాలను బయట పెట్టేందుకే సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం భర్తను భార్య టార్చర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణల కేసు - బాధితుల కోసం 'సిట్' హెల్ప్ లైన్