అన్వేషించండి

Warangal News : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరుగుతున్న జలగండాలు, ఒకే నెలలో ఐదుగురు మృతి

Warangal News : ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా, మరో ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు.

Warangal News : వరంగల్ జిల్లాలో జలగండాలు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలో రెండు నీటి ప్రమాదాలు చోటుచేసుకుని 5 మంది మృతి చెందారు. ఈత కోసం  వెళ్లిన వారు కొందరైతే... ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మరికొందరు మృతిచెందారు. జిల్లాలోని నర్సంపేట మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో పడి చనిపోగా మహబూబాబాద్ జిల్లాలో కాలువలో కొట్టుకునిపోయి మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 

వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగళదాసు కృష్ణమూర్తి మార్చి 14న  ఆదివారం కావడంతో తన మనవళ్లు దీపక్, కార్తీక్‌లతో పాటు కొడుకు నాగరాజుతో కలిసి  వ్యవసాయ బావివద్దకు వెళ్లారు. అక్కడ మొక్కజొన్న చేను కోసిన తర్వాత వాటిని బస్తాల్లో నింపారు. ఆ తర్వాత స్నానం చేసేందుకు పక్కనే ఉన్న ఓ బావి వద్దకు తన మనవళ్లతో పాటు కృష్ణమూర్తి చేరుకున్నారు. ముందుగా తన పెద్ద మనవడు కార్తీక్‌కు స్నానం చేయించి ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత దీపక్‌ను తీసుకువెళ్లి స్నానం చేయిస్తుండగా దీపక్ అకస్మాత్తుగా కాలు జారీ నీళ్లలో పడ్డాడు. అయితే బావి లోతుగా ఉండడంతో మనవడు మునిగిపోతుండడం చూసిన కృష్ణమూర్తి వెంటనే నీళ్లలోకి దిగాడు. తనకు ఈత రాకున్న మనవడిని కాపాడాలనే కంగారులో నీళ్లలోకి దూకారు. దీంతో ఇద్దరు నీళ్లలో మునిగిపోవడంతో  గట్టుపై ఉన్న  మరో మనవడు కార్తీక్ వెంటనే తన తండ్రిని అప్రమత్తం చేశాడు. గట్టిగా కేకలు వేసి తండ్రి నాగరాజును తీసుకువచ్చాడు. దీంతో నాగరాజు సైతం ఏ మాత్రం ఆలోచించకుండా తనతండ్రితో పాటు కొడుకును కాపాడుకునేందుకు నీళ్లలోకి దూకాడు. దీంతో ముగ్గురికి ఈత రాకపోవడంతో ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరోకరు ప్రాణాలు వదలడం అది కూడా ఒకే కుటుంబానికి చెందిన తాత, తండ్రి కొడుకులు కావడం మరింత హృదయవిదారకంగా మారింది. ఒకే కుటుంబంలో మూడు తరాల వ్యక్తులు చనిపోవడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

కాలువలో కొట్టుకుపోయిన చిన్నారులు 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తౌర్యాతండా గ్రామం శివారు దుబ్బతండా వద్ద ఎస్సారెస్పీ కాల్వలో పడి దారవత్ రమ్యశ్రీ (7), దారవత్ వసంతి (9) ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. ఎస్ ఆర్ఎస్పీ కాలువ వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులను మృత్యువు మింగేసింది. దుబ్బతాండకు చెందిన నలుగురు చిన్నారులు సరదాగా ఆడుకునేందుకు కాలువలోకి దిగారు. కాలువను దాటేందుకు ఏర్పాటు చేసిన రక్షణ తాడును పట్టుకుని కొద్ది సమయం పాటు చిన్నారులు ఆడుకుని కేరింతలు కొట్టారు. ఇంతలోనే అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరిగి తాడు తెగిపోవడంతో చిన్నారులు కాలువలో కొట్టుకుపోయారు. నలుగురు చిన్నారులు కొట్టుకుపోవడాన్ని గమనించిన ఆ గ్రామానికి చెందిన యువతి కేకలు వేయడంతో మిర్చి తోటలో పనిచేస్తున్న చిన్నారులు లోకేష్, చరణ్ తేజ్ లో కాలువ దగ్గరకు చేరుకున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు సాహసం చేసి మొదటగా కాలువలో కొట్టుకుపోతున్న హిందు(8), వైష్ణవిలను (12) కాపాడారు. ఇంతలోపే దారావత్ రమ్య శ్రీ (7), దారావత్ వసంతిలు కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి చనిపోయారు.

అప్రమత్తమైన అధికారులు

ఈ రెండు సంఘటనలు వెంట వెంటనే జరగడంతో స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వేసవి కాలంలో ఉపశమనం కోసం రాబోవు రోజుల్లో ఈత కోసం మరింత మంది వెళ్లే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఈత రాని వారిని, చిన్న పిల్లలను జలాశయాల దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Embed widget