Warangal: లవర్ మోసం చేసిందని సెల్ఫీ సూసైడ్, ఆమెకు బర్త్‌డే విషెస్ చెప్పి ఉరేసుకున్న యువకుడు!
మోసం చేసిన అమ్మాయి పుట్టిన రోజున అర్ధరాత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి చనిపోతున్నట్లు పేర్కొన్నాడు. ఆమె ప్రతి పుట్టినరోజున తన చావు గుర్తుకు రావాలని సెల్ఫీ వీడియోలో చెప్పాడు.
హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఓ యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన యువకుడు మండ సాయిచరణ్ (24) అనే వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియోలో తెలిపి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా యువకుడు సాయి చరణ్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. మోసం చేసిన అమ్మాయి పుట్టిన రోజున అర్ధరాత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి చనిపోతున్నట్లు పేర్కొన్నాడు.
ఆమె ప్రతి పుట్టినరోజున తన చావు గుర్తుకు రావాలని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. తాను ప్రేమించిన అమ్మాయి అఫైర్ పెట్టుకున్న యువకుడు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఈనెల 17న తనను దారుణంగా కొట్టారని తెలిపాడు. అక్క, బావ, అమ్మ, నాన్న, స్నేహితులందరూ క్షమించండి అని సెల్ఫీ వీడియోలో తెలుపుతూ ఫ్యాన్ కు ఉరేసుకొని తనువు చాలించాడు. వయసు ప్రభావం, క్షణికావేశంతో యువకుడు సాయి చరణ్ నిండు జీవితాన్ని బలి చేసుకున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.