అన్వేషించండి

RTC Bus Accident : ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్, ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు!

APSRTC Bus Accident : విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది.

APSRTC Bus Accident : విజయనగరం జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. శృంగవరపుకోట మండలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో  అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై నడిచి వెళ్తోన్న బాలుడి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. బస్సు కంట్రోల్ కాకపోవడంతో పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకుపోయింది. ఇంట్లో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు  

ఆర్టీసీ బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదుపుతప్పిన బస్సు ఢీకొని ఏడో తరగతి విద్యార్థి సిరికి అభిషేక్‌ మృతి చెందాడు.  అనంతరం రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు ఇంటి గోడ ఢీకొట్టింది. గోడ కూలి మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. 

ఆర్టీసీ బస్సు బోల్తా 

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి చివరి ఘాట్ లో జైలు పల్లి రోడ్డు సమీపంలో వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే మరో 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంతే కాకుండా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జాతరకు వెళ్తుండగా 

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. థరూర్ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. 

కడపలో ఆటో లారీ ఢీ - ముగ్గురు మృతి

కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పొట్లదుర్తి గ్రామానికి చెందిన భార్య భర్తలైన సిరంగి దస్తగిరి (45), సిరంగి సరస్వతి (35) అనారోగ్యం కారణంగా వైద్యం కోసం ఆటోలో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామానికి వెళ్లారు. తిరిగి పోట్లదుర్తి గ్రామానికి వస్తుండగా ముద్దనూరు వద్దకు రాగానే తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ప్రమాదంలో దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ పట్నం ప్రేమ్ కుమార్ తీవ్ర గాయాలు అయ్యాయి. 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చంద్ర మోహన్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget