Vizag Crime: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం, కుళ్లిన స్థితిలో మృతదేహం
విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. వాటర్ డ్రమ్ములో మహిళ మృతదేహం కనిపించింది. ఇది గమనించిన ఇంటి ఓనర్ భయాందోళనకు గురయ్యాడు.
Vizag Crime News: Woman found dead at Madhurawada in Visakhapatnam: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. వాటర్ డ్రమ్ములో మహిళ మృతదేహం కనిపించింది. ఇది గమనించిన ఇంటి ఓనర్ భయాందోళనకు గురయ్యాడు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మహిళను హత్య చేసి కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంటి ఓనర్, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పిఎంపాలెం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 24 గంటలు గడవకముందే నగరంలో రెండు హత్యల సంఘటనలు జరగడంతో విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లవర్‌తో కలిసి భర్తను చంపిన మహిళ!
(Wife Kills Husband With Help of Lover) తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ క్రైమ్ సీన్.. 'దృశ్యం-2' సినిమాను తలపించింది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించి.. చివరకు పోలీసులకు దొరికి పోయింది. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో ఉండే ఓ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. కానీ భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. అదే సమయంలో ఆ భార్యకు.. మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొన్ని రోజులకు భార్య వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసింది. ఇదే విషయమై ఇటీవల ఓ రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేసింది. ప్రియుడు ఇంటి వెనుక ద్వారం నుంచి అప్పటికే రాగా.. ఆమె తన భర్తను గొంతు కోసి చంపేసింది. ఆవుల కొట్టంలో నుంచి తాడు తెచ్చి కాళ్లు, చేతులను దగ్గరికి లాగి తాళ్లతో కట్టేసి సంచిలో వేశారు.
భర్త కనిపించడంలేదని ఫిర్యాదు
కారులో మృతదేహాన్ని రాంనగర్ వద్దకు తీసుకెళ్లారు. మృతుడి ఫోన్‌ను ఓ ఖాళీ ప్రదేశంలో పడేశారు. తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఒక్కొక్కటిగా వేరే వేరే ప్రదేశంలో విసిరేశారు. తరువాత భర్త మృతదేహాన్ని మైసూరు-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఓ కాలువలో 50 మీటర్ల లోతులో మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తర్వాత రోజు మహిళ తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని దర్యాప్తులో తెలిసింది. రాంనగర్ జిల్లా కెంపేగౌడ దొడ్డి సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెతో సహా తన ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.