News
News
X

విశాఖ వాసులను వణికిస్తున్న వరుస హత్యలు, సెటిల్‌మెంట్లు కొంపముంచుతున్నాయా !

విశాఖలో ఒక్క సైకో కిల్లర్ ఇష్యు పక్కనబెడితే అంతకు ముందు .. ఆ తరువాత జరిగిన హత్యల్లో పాత నేరస్తులూ.. లేదా రౌడీ షీటర్ల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

FOLLOW US: 

Vizag Crime: విశాఖ నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, నేరాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న గాక మొన్న వరుసగా మూడు హత్యలు చేసిన సైకో కిల్లర్ ను అరెస్ట్ చేశారని ఊపిరి పీల్చుకునేలోపే ఎంవీపీ కాలనీలో జరిగిన అనిల్ కుమార్ అనే వ్యక్తి హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. కాకినాడలో 2017 లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న అనిల్ కుమార్ తనకు ముప్పు ఉంటుందన్న భయం తో వైజాగ్ కు వచ్చేశాడు. ఇక్కడే కార్ డ్రైవర్ గా బతుకుతున్న అనిల్ గత ఐదేళ్లుగా ఎలాంటి నేరాలకు పాల్పడలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న తనను ఎంవీపీ కాలనీలో దారుణంగా హత్య చేసారు.

కొంపముంచుతున్న సెటిల్‌మెంట్స్.. 
ఇటీవల లోకల్ గా జరుగుతున్న చిన్న చిన్న సెటిల్ మెంట్‌లలో తలదూర్చడం.. ఈ క్రమంలో ఆదర్శ్ నగర్ లో ప్రవేట్ బస్సు నడుపుకునే శ్యామ్ ప్రకాష్ తో ఏర్పడిన ఆధిపత్య గొడవల్లో భాగంగా శ్యామ్ ప్రసాద్ మరో ఇద్దరితో కలిసి అనిల్ కుమార్‌ను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. అంతకుముందు సైకో కిల్లర్ పెందుర్తి ఏరియాలో సృష్టించిన హత్యల కలకలం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఒక్క సైకో కిల్లర్ ఇష్యు పక్కనబెడితే అంతకు ముందు .. ఆ తరువాత జరిగిన హత్యల్లో పాత నేరస్తులూ.. లేదా రౌడీ షీటర్ల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

కౌన్సెలింగ్ ఇస్తున్నా మార్పు అంతంతే.. 
రౌడీ షీటర్లను క్రమం తప్పకుండా పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నా వారు మారడం లేదని వరుసగా  జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. విశాఖలో దాదాపు 600  మందివరకూ రౌడీ షీటర్లు ఉన్నట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇలాంటి వారి కదలికలు, వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు పోలీస్ నిఘా ఉంటుంది . ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు నివేదికలు వెళుతూనే ఉంటాయి. అయితే విశాఖలో జరుగుతున్న వరుస సంఘటనలు నిజంగా గ్రౌండ్ లెవెల్ లో రౌడీ షీటర్ల కదలికలు పైస్థాయి అధికారుల వరకూ వెళుతున్నాయా లేదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

మరికొందరు నేరగాళ్లు పొలిటీషియన్స్ అనుచరులుగా చెప్పుకుంటూ తిరుగుతున్నారనీ.. ఆ పేరుతొ చోటా మోటా సెటిల్ మెంట్‌లకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్లు చేసే పనులు సిటీ ఇమేజ్ ను గత కొంతకాలంగా దెబ్బతీస్తూ.. ప్రశాంతమైన నగరంగా ఉన్న వైజాగ్ ను ఇప్పడు క్రైమ్ సిటీగా మార్చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

వైజాగ్ లో ఇటీవల జరిగిన కొన్ని హత్యలు  
మే  27- మర్రిపాలెం లో సాయితేజ అనే యువకుడి హత్య 
జూన్ 10-పరవాడ లో భీమా (22) హత్య 
జూలై 18- వివాహేతర సంబంధం ఇష్యు లో షీలానగర్ లో సురేష్ అనే వ్యక్తి హత్య
జూలై  20-  భార్య మృదుల ఆమె ప్రియుడి చేతిలో   ప్రొఫెసర్  మురళి హత్య 
జూలై  23- పెద వాల్తేరు లో అప్పల రెడ్డి అనే యువకుడి హత్య 
జూలై 26- సింథియా లో సిద్దార్ద్ పట్నాయక్ అనే ఒడిశా వ్యక్తి హత్య
ఆగస్టు 6- పెందుర్తి లో సైకో కిల్లర్ చేతిలో వాచ్ మెన్  దంపతుల హత్య 
ఆగస్టు 14- సుజాత నగర్ లో వాచ్ మెన్ హత్య
ఆగస్టు 17- ఎంవీపీ కాలనీలో అనిల్ కుమార్ హత్య

Published at : 19 Aug 2022 01:29 PM (IST) Tags: Visakhapatnam Visakha Crime News VIZAG Telugu News

సంబంధిత కథనాలు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం

YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం

టాప్ స్టోరీస్

Madhapur Crime: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

Madhapur Crime: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

CUET PG Result: సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

CUET PG Result:  సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

Upcoming Movies: 'పొన్నియిన్ సెల్వన్', 'విక్రమ్ వేద' - ఈ వారం థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్!

Upcoming Movies: 'పొన్నియిన్ సెల్వన్', 'విక్రమ్ వేద' - ఈ వారం థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్!