Vizag Crime News: లాడ్జిలో యువతి -హాస్టల్‌లో బాయ్స్ - పెద్ద ఫైటింగే జరిగింది - అసలు ట్విస్ట్ ఇదే
Visakhapatnam: విశాఖలో ఓ లాడ్జిలో ఉన్న యువతి పక్కన ఉన్న హాస్టల్‌లోని యువకులపై దాడి చేసింది. తన న్యూడ్ వీడియోలు తీశారని ఆరోపిస్తోంది.

Lodge And Hostel dispute: విశాఖలో సవేరా ఇన్ లాడ్జిలో ఉంటున్న ఓ యువతి .. ఆ లాడ్జి పక్కనే హాస్టల్‌లో ఉంటున్న ముగ్గురు యువకులపై దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాదింది. వారు తన న్యూడ్ వీడియోలు తీశారని ఆమె ఆరోపిస్తోంది. ఎలా తీశారంటే.. బాత్ రూమ్‌లో స్నానం చేస్తూండగా తీశారని ఆరోపిస్తోంది. ఆమెతో పాటు మరికొంత మంది యువకులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు.
దాడి చేసిన యువతి పేరు దుర్గా గా గుర్తించారు. సందీప్ అనే యువకుడితో కలిసి నాలుగు రోజుల కిందట లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. నాలుగు రోజులుగా వారు అక్కడే ఉంటున్నారు. హఠాత్తుగా ఏమయిందో కానీ.. లాడ్జి పక్కనే ఉన్న 4S అనే లాడ్జిలో కుర్రాళ్లపై దాడికి వెళ్లింది. సందీప్ అనే యువకుడు.. సీతంపేట, రెల్లివీధికి చెందిన తన స్నేహితుల్ని కూడా పిలిపించి దాడి చేశారు. ఈ దృశ్యాలను రికార్డు చేశారు. సోషళ్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఆ యువతి తన నగ్న దృశ్యాలను రహస్యంగా రికార్డు చేశారని ఆరోపిస్తున్నారు. కానీ లాడ్జిలో బాత్ రూమ్‌లు ఏవీ బయటకు ఉండవు. అటాచ్డ్ గానే ఉంటాయి. వాటిలోకి కెమెరాలను పంపించడం సాధ్యం కాదు. పక్కనే ఉన్న లాడ్జి లో నుంచి కూడా కెమెరాలు పెట్టడం సాధ్యం కాని రీతిలో బాత్ రూమ్ లు ఉన్నాయి. అదే సమయంలో లాడ్జిలోని యువకుల ఫోన్లలో ఆ యువతికి సంబంధించిన ఎలాంటి దృశ్యాలు లేవు. దీంతో ఇంకేదో జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ లోకల్ కే చెందిన సందీప్,దుర్గా లాడ్జిలో రూమ్ తీసుకుని ఎందుకు ఉంటున్నారన్నది వారు చెప్పడం లేదు. అక్కడేమైనా అసాంఘికమైన పనులు చేస్తున్నారా.. లాడ్జిలోని యువకులతో ఏమైనా డీలింగ్స్ పెట్టుకుని తేడా వస్తే దాడి చేశారా అన్న అంశాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. న్యూడ్ ఫోటోలు,వీడియోలు తీసినందుకు దాడి అని దృశ్యాలు వైరల్ కాగానే పోలీసులు వెంటనే స్పందించారు. ఇరు వర్గాల వారిని అదుపులోిక తీసుకున్నారు. దాడికి గురైన యువకుల ఫోన్లను తీసుకుని యువతి వీడియోలు ఉన్నాయేమో పరిశీలిస్తున్నారు. డిలీట్ చేసి ఉంటారేమోనని ఫోన్ ను కూడా టెక్నికల్ గా బ్యాకప్ చేయిస్తున్నారు.
ఈ దాడుల వెనుక మిస్టరీ ఏమిటో తేల్చాలని పోలీసులు డిసైడయ్యారు. లాడ్డిలో యువకుడితో ఆ మహిళ రోజుల తరబడి ఉండటం.. తర్వాత బాయ్స్ హాస్టల్ లో ఉన్న వారి పై దాడి చేయడం వెనుక బయటకు చెబుతున్న కారణాలు కాక ఇంకేవో ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.





















