Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో 87 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 87 ఎకరాల్లో గంజాయి తోటలను ఎస్ఈబీ అధికారులు ధ్వంసం చేశారు.
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో "ఆపరేషన్ పరివర్తన" కార్యక్రమంలో భాగంగా మంగళవారం 87 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశారు పోలీసులు. ఏజెన్సీలోని చింతపల్లి మండలం తమ్మంగుల, కుడుముసారి పంచాయతీ గ్రామాలైన కిలిమిసింగి, దానుడివీధి, దబ్బగరువు, ధోని పొలాలు, భీమునిపల్లి, సంపంగిపుట్టు అటవీ ప్రాంతాలలో 87 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఎస్ఈబీ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు.
Also Read: సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించిన డాక్టర్.. దాన్ని తన చేతికే పెట్టుకొని..
ఆపరేషన్ పరివర్తన
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ జిల్లాతో ముడిపడి ఉంటున్నాయి. దీంతో ఎస్ఈబీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారు. ఏజెన్సీలోని గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. చింతపల్లి మండలం తమ్మంగుల పంచాయతీ లుంబూరు, ధోనిపోలాలు, పూసల పాలెం, బొద్దుజివ్వలో 75 ఎకరాల్లో గంజాయి తోటలను సోమవారం నాశనం చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్ఈబీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు, అధికారులు గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు.
Also Read: అట్టిక గోల్డ్ కంపెనీలో చోరీ... ఇంటి దొంగ పనే... రెండు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో
రెండ్రోజుల క్రింత ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వంద ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశామని చిత్రకొండ సీఐ సూర్యప్రకాష్ తెలిపారు. ఒడిశా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధి జోడాపుట్, బందమామిడి పంచాయతీ పరిధిలో కటప్ ప్రాంతంలో వందెకరాల గంజాయి తోటలను ఎక్సైజ్ పోలీసులు, ఒడిశా పోలీసులు ధ్వంసం చేశారు. ఏవోబీలో గంజాయి ఆపరేషన్ పరివర్తన నిరంతరం కొనసాగుతుందని సీఐ తెలిపారు. గంజాయి సాగుకు గిరిజనుల స్వస్తి పలికే వరకు ఆపరేషన్ పరివర్తన కొనసాగుతుందని వెల్లడించారు. గిరి రైతులు ప్రత్యామ్నా్య పంటలపై దృష్టి సారించాలని, అందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తుందని తెలిపారు. ఏజెన్సీలోని కొయ్యూరు మండలంలో బూదరాళ్ల పంచాయతీలో శనివారం కొర్రపాడు, బొడ్డు మామిడి, దవడ గొయ్యి, కిండంగి, నేరెళ్ల బంధ గ్రామాల్లో 46 ఎకరాలలో గంజాయి తోటలను ఎస్ఈబీ పోలీసులు ధ్వంసం చేశారు.
Also Read: నా భర్త సైకోలా వేధించాడు... సూసైడ్ నోట్ రాసి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి