Visakha News : మద్యం మత్తులో యువతి వీరంగం, ఏఎస్ఐను కాలితో తన్ని, దాడికి యత్నం!
Visakha News : విశాఖలో మద్యం మత్తులో యువతి వీరంగం సృష్టించింది. విశాఖ బీచ్ రోడ్డుపై బీర్ తాగుతూ స్థానికులు, పోలీసులపై దాడికి యత్నించింది.
Visakha News : విశాఖలో మద్యం మత్తులో యువతి హల్ చల్ చేసింది. వైఎంసీఏ వద్ద మద్యం, గంజాయి మత్తులో బుధవారం అర్ధరాత్రి యువతి పోలీసులు, స్థానికులపై దాడి చేసింది. రోడ్డుపై యువతి బీరు తాగుతూ గంజాయి సిగరెట్ సేవిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. యువతిని నిలువరించేందుకు ప్రయత్నించిన త్రీటౌన్ ఏఎస్ఐ పి.వి.వి సత్యనారాయణపై బీర్ బాటిల్ తో దాడి చేసింది. ఏఎస్ఐ సత్యనారాయణపై బీర్ బాటిల్ విసరగా గోవింద్ అనే యువకుడు కంటికి తగలడంతో గాయమైంది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో యువతిపై గోవింద్ ఫిర్యాదు చేశాడు. ఏఎస్ఐ పై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కాలితో తన్నేందుకు యువతి యత్నించింది. యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏఎస్ఐ సత్యనారాయణకి న్యాయం జరగాలని యువతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మూడో పట్టణం పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. తన ప్రియుడు దుర్గాప్రసాద్ అలియాస్ ఏటీఎం అనే వ్యక్తికి చెప్తే మీ పని అయిపోతుందని బెదిరింపులు పాల్పడింది. పోలీసులైతే మీరేం చేయగలరు అని అసభ్య వ్యాఖ్యలతో దూషించింది.
మద్యానికి బానిసై
మద్యానికి విపరీత స్థాయిలో బానిసైన ఓ వ్యక్తి చేసిన పని అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఈ ఘటన గురించి తెలుసుకొని అందరూ అవాక్కవుతున్నారు. ఓ తాగుబోతు వ్యక్తి రెండు కుక్క పిల్లల తోక చెవులు కత్తిరించి వాటికి ఉప్పు, కారం కలిపాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బరేలీ జిల్లాలోని ఫరీదాపూర్ ప్రాంతంలో ఎస్‌డీఎం కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండు కుక్క పిల్లల్లో ఒకదానికి చెవులు కోసి, రెండో దానికి తోక కట్ చేశాడు. అవి అక్కడే బాగా మూలుగుతూ తీవ్రమైన రక్త స్రావంతో తిరుగుతుండడం స్థానికులు గమనించినట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే వాటిని పశువైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారని, వాటి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలిపారు. నిందితుడ్ని పోలీసులు ముఖేష్ వాల్మీకి అని గుర్తించారు. ఈ అసహ్యపని చేసే సమయంలో అతను తన స్నేహితుడితో కలిసి మద్యం తాగుతున్నాడు. స్థానికులు జంతుసంరక్షణ యాక్టివిస్ట్ లకు సమాచారం అందించడంతో ధీరజ్ పాఠక్ అనే జంతు ప్రేమికుడు అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే కుక్కపిల్లలు రక్తం కారుతూ ఏడుస్తూ ఉన్నాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై ధీరజ్ పాఠక్ ఫిర్యాదు చేయించారు. దాంతో జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించారనే నేరం కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనపై తగిన విచారణ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అఖిలేష్ చౌరాసియా చెప్పారు.
తోక, చెవులు కత్తిరించి
ముఖేష్ వాల్మీకి మద్యం మత్తులో పట్టుకున్న రెండు కుక్క పిల్లలు వీధి కుక్క పిల్లలు. ఘటన తర్వాత కుక్కపిల్లలు రెండూ చలిలో విలపిస్తున్నాయి. తాగుబోతులు రెండు కుక్కపిల్లల తోక, చెవులు కోసిన తర్వాత నిందితుడు ఆ భాగాలను మాయం చేశాడు. అక్కడున్న మహిళ రక్తంపై మట్టి వేసి సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫరీద్‌పూర్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మూగ జంతువులతో క్రూరత్వం గుర్తించినప్పుడు, చుట్టుపక్కల ప్రజలు సంఘటన గురించి PFA యొక్క రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. టీమ్ ఇన్‌ఛార్జ్ ధీరజ్ పాఠక్ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, కుక్కపిల్లలు రెండూ రక్తంతో కప్పబడి మూసివున్న గదిలో మొరాయిస్తున్నాయి, వాటి రెండు చెవులు కోసి రక్తం కారుతున్నాయి. అనంతరం రెండు కుక్కపిల్లలకు వైద్య చికిత్స అందించారు.