Viral Video: స్కూల్ బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య.. వీడియో వైరల్
జైపూర్ లోని ఓ స్కూల్ విద్యార్థిని మృతి మిస్టరీగా మారింది. ఆమె ఎందుకు చనిపోయింది అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. స్కూల్ సిబ్బంది పరారీలో ఉన్నారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని చనిపోయిన తర్వాత, పాఠశాల అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వకముందే సంఘటనా స్థలాన్ని మొత్తం శుభ్రం చేయడం అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థిని ఆత్మహత్య తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా బాధ్యులైన వారంతా అదృశ్యమయ్యారు. పోలీసులు, విద్యా శాఖ అధికారులు ప్రిన్సిపాల్‌తో సహా బాధ్యులను సంఘటనకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
విద్యార్థిని మరణంపై సస్పెన్స్
విద్యార్థిని మరణం ప్రమాదమా, లేక ఆమె స్వయంగా దూకిందా లేదా ఎవరైనా తోసారా అని నేటి ఉదయం వరకు అనుమానాలుండేవి. కానీ ఆదివారం ఉదయం వైరల్ అయిన వీడియో గమనిస్తే.. విద్యార్థిని స్వయంగా బిల్డింగ్ లోని ఓ పై అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నట్లు స్పష్టమైంది. పన్నెండేళ్ల విద్యార్థిని మరణంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినిని తీవ్రంగా మందలించాడని, దాంతో బాధపడి ఆమె ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతోంది.
సిసిటివి ఫుటేజ్‌తో
విద్యార్థిని ఆత్మహత్యపై స్కూల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సంబంధిత వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఆమె పేరు అమైరా. ఆ బాలిక వయస్సు 12 సంవత్సరాలు కాగా, ఆరో తరగతి చదువుతోంది. అక్కడ అమర్చిన సిసిటివి ఫుటేజ్ మాత్రమే ఆధారం. సిసిటివి ఫుటేజ్ బయటకు రావడంతో ఆత్మహత్య అని తేలింది.
नीरजा मोदी स्कूल….!!
— kapil bishnoi (@Kapil_Jyani_) November 2, 2025
स्कूल वालों ने CCTV फ़ुटेज शेयर किया…
विडियो क्रॉप किया हुआ दिख रहा है…
जिसमें अमायरा खुद चौथी मंज़िल की रैलिंग पर चढ़ रही है
और वहाँ से छलांग लगा रही है…
लेकिन उस वक़्त कोई व्यक्ति बच्ची के पीछे खडा नज़र आ रहा है…
वो चाहता तो बच्ची को रोक सकता… pic.twitter.com/o6YRIkxJQG
జైపూర్ నగరంలోని ప్రసిద్ధ కాన్వెంట్ పాఠశాల నీరజా మోదీ స్కూల్ సిబిఎస్‌ఈ బోర్డు ద్వారా మానసరోవర్‌లో నిర్వహిస్తున్నారు. సంఘటన శనివారం (నవంబర్ 1) మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుండి రెండు గంటల మధ్య విద్యార్థిని అమైరా కింద పడిపోయిన శబ్దం వినిపించడంతో సిబ్బంది పరిగెత్తారు. మెట్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. సిబ్బంది ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, పరీక్షించిన డాక్టర్లు ఆమెను చనిపోయినట్లు ప్రకటించారు. విద్యార్థిని తలకు బలమైన గాయం కావడంతో తీవ్రరక్తస్రావం అయింది. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.
బాధ్యులు ఎందుకు అదృశ్యమయ్యారు?
సంఘటన తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులు ఎందుకు అదృశ్యమయ్యారు? పోలీసులకు, విద్యా శాఖ అధికారులకు స్కూల్ సిబ్బంది ఎందుకు సహకరించలేదు? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో పిల్లల భద్రతపై మరోసారి ఆందోళన మొదలైంది. భారీ ఫీజులు వసూలు చేస్తాయి, కాని వారి భద్రతను గాలికొదిలేస్తున్నారని విమర్శలున్నాయి.
పాఠశాల పాత్రపై విద్యా మంత్రి ఆగ్రహం
ఈ సంఘటనపై రాజస్థాన్ విద్యా మంత్రి మదన్ దిలావర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జిల్లా విద్యాధికారికి విచారణ అప్పగించామని అన్నారు. విచారణ నివేదికలో ఎవరి నిర్లక్ష్యం తేలితే లేదా ఎవరైనా దోషిగా తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. స్కూల్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారి చాలా గంటల పాటు ప్రిన్సిపాల్, మేనేజర్, ఇతర బాధ్యులను వెతికి నిరాశతో తిరిగారు.






















